చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!

Updated on: Jun 27, 2026 | 5:12 PM

ఒత్తిడి, ఆందోళన లేదా బోర్ కారణంగా ఆకలి లేకపోయినా తినడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. ఈ అలవాటు వల్ల అధిక క్యాలరీలు శరీరంలో చేరి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం, వ్యాయామం చేయడంతో పాటు పండ్లు, నట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా, చాక్లెట్స్, స్వీట్స్, కేక్స్, జ్యూసెస్, బేకరీ ప్రొడక్ట్స్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే, బయట హోటల్‌కు వెళ్లి లార్జ్ మీల్స్ తినడం చేస్తుంటారు. వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల రకరకాల మెటబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట. ఒత్తిడి కారణంగా తింటుంటే, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, క్రమం తప్పని వ్యాయామం సహాయపడతాయని అంటున్నారు. కొన్ని అలవాట్ల వల్ల ఈ ఎమోషనల్ ఈటింగ్‌ చేస్తారట. ఎలాగంటే, రోజూ ఒక చాక్లెట్ తినే అలవాటు ఉండటం, ఎవరైనా తింటుంటే తినాలనిపించడం వంటివి ఎమోషనల్ ఈటింగ్‌ ను ట్రిగ్గర్ చేస్తాయంటున్నారు నిపుణులు. బోర్ కొట్టినప్పుడు ఆకలి లేకున్నా తినడం కూడా ఎమోషనల్ ఈటింగ్ కిందకే వస్తుందని చెబుతున్నారు. ఆహారం విషయంలో ఇతరుల ప్రభావం పడి ఇలా తింటుంటారు. కొన్ని సార్లు ఏ పని లేక టైం పాస్ చేయడానికి ఏదో ఒకటి నోట్లో వేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు కూడా ఎమోషనల్ ఈటింగ్‌ ను ట్రిగ్గర్ చేస్తాయట. భోజనాల మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే, తాజా పండ్లు, నట్స్ లేదా వెన్న లేని పాప్‌కార్న్ వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎమోషనల్ ఈటింగ్ వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు చేరి శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనివల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఎమోషనల్ ఈటింగ్‌ ను తగ్గించుకోవడానికి ముందుగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలట. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకోకుండా మ్యూజిక్ వినడం, ఫ్రెండ్స్​తో మాట్లాడటం, వాకింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గి, ఎమోషనల్ ఈటింగ్ కంట్రోల్ అవుతుంది. అలాగే, తాజా పండ్లు, ఫైబర్ ఎక్కువ ఉండే కూరగాయలు, నట్స్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ, సూప్స్ లాంటివి తీసుకోవాలట. మీ అవగాహన కోసం మేం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. సందేహాలున్న వారు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వైద్య చికిత్సకు ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ అధికారులు.. శతాబ్దాల నాటి రహస్యాలు వెలుగులోకి!

అమ్మదొంగా.. నువ్వు మామూలోడివి కాదురోయ్‌.. ముక్కంటి హుండీకే కన్నమా?

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. స్మోకింగ్ చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష !

వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్‌.. ఒకే సారి మూడు భారీ చేపలు.. ధరతెలిస్తే షాకవుతారు

Samantha: ‘నా బిడ్డే నా ప్రపంచం..’ పుట్టబోయే బిడ్డపై సమంత ఎమోషనల్ కామెంట్స్

Follow Us