క్యా సీన్ హై.. మరుగు దొడ్లో బంగారం.. చిప్స్ ప్యాకెట్లో
మంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీ బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను భగ్నం చేశారు. విమానాశ్రయ ఉద్యోగుల సహకారంతో జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌లో రూ. 3.77 కోట్ల విలువైన బంగారం, రూ. 73 లక్షల నగదు, 1.33 కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
మంగళూరు విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డగా మారిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. విమానాశ్రయంలో ఇంటి దొంగల గుట్టురట్టు చేసి, బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరు విమానాశ్రయ ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 3.77 కోట్ల విలువైన బంగారం, రూ. 73 లక్షల నగదుతో పాటు 1.33 కిలోల సింథటిక్ మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు విదేశాల నుంచి అక్రమంగా బంగారం, డ్రగ్స్ తీసుకురావడానికి విమానంలోని మరుగుదొడ్లను సురక్షిత మార్గంగా ఉపయోగించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో వెల్లడైంది. విమానం శుభ్రం చేసే సిబ్బంది ఈ సరుకును బయటకు తీసి తమ అనుచరులకు అప్పగిస్తున్నారని అధికారులు తెలిపారు. నవంబర్ 23న విదేశాల నుంచి వచ్చిన విమానం మరుగుదొడ్డి నుంచి సిబ్బంది బంగారాన్ని బయటకు తీస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు. తనిఖీల్లో మూడు సీసాల్లో ద్రవరూపంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో, చిప్స్ ప్యాకెట్లలో దాచి తరలిస్తున్న 1.33 కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మస్కట్ నుంచి మంగళూరు విమానాశ్రయానికి చేరినట్లు అధికారులు తెలిపారు. 14 డ్రగ్స్ పొట్లాలను స్వాధీనం చేసుకొని, వాటిని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, డ్రగ్స్ వివరాల ఆధారంగా ఈ ముఠా వెనుక ఉన్న మిగిలిన వారిపై డీఆర్ఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
14 ఏళ్ల నాగార్జున రికార్డు బ్రేక్.. తరుణ్ భాస్కర్ సెన్సేషన్!
సూర్య – జ్యోతిక లవ్ స్టోరీని.. లీక్ చేసిన లైలా
Shruti Haasan: దుష్టశక్తులను ఆరాధిస్తోందా? శృతిని తప్పుగా అర్థం చేసుకున్నారా?
నవంబర్ సెంటిమెంట్ బ్రేక్… కాసులు కురిపిస్తున్న కంటెంట్
Dhanush: నాలుగోసారి అదే కాంబో.. బాలీవుడ్లో ధనుష్ భారీ ప్లాన్!
