మరోసారి ఫైర్ అయిన దీపిక… లేటెస్ట్ కామెంట్స్‌తో అంతా క్లారిటీ వచ్చినట్టేనా?వీడియో
దీపికా పదుకొనే ఇటీవల తనపై వచ్చిన వివాదాలు, వృత్తిపరమైన ఆరోపణలపై స్పందించారు. కల్కి 2, స్పిరిట్ వంటి చిత్రాల నుంచి తొలగింపు వెనుక కారణాలను స్పష్టం చేశారు. పరిశ్రమలో పని గంటలకు సంబంధించి నెలకొన్న లింగ వివక్షను దీపిక ఎత్తిచూపారు, భవిష్యత్ నటీమణులకు మంచి పని వాతావరణం కోసం పోరాడుతున్నట్లు తెలిపారు.
వరుస విమర్శలు, వివాదాల అనంతరం స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తన నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను, వివాదాస్పదమైన అంశాలను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో దీపికా పదుకొనే సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా కల్కి 2, స్పిరిట్ వంటి చిత్రాల నుంచి ఆమెను తప్పించడంతో, ఆమె వైఖరి కారణంగానే ఈ నిర్ణయం జరిగిందని ప్రచారం జరిగింది. ఈ విమర్శలపై దీపిక స్పందిస్తూ, ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నారని, అయితే తన విషయంలోనే ఈ రచ్చ జరగడం అర్థం కావడంలేదని అన్నారు. అంతేకాకుండా, చాలా మంది హీరోలు చాలా కాలంగా ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తున్నారని గుర్తుచేస్తూ, సినీ పరిశ్రమలో నెలకొన్న లింగ వివక్షను బహిర్గతం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో
