ఓఆర్ఆర్‌పై యువత వీరంగం.. రేసింగ్‌లు, స్టంట్లతో ప్రాణాలతో చెలగాటం

Edited By:

Updated on: Jun 06, 2026 | 8:14 PM

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రమాదకర విన్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కార్లు, బైక్‌లతో రేసింగ్‌లు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా డోర్లపై కూర్చొని విన్యాసాలు చేసిన ఘటన వైరల్‌గా మారింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఇటువంటి చర్యలే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్.. సిటీకి తలమానికం. కానీ, ఇప్పుడు ఇది డేంజర్ జోన్‌గా మారుతోంది. చీకటి పడితే చాలు.. కొందరు యువకులు రోడ్డెక్కి రెచ్చిపోతున్నారు. ఎవరికీ భయపడకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రోడ్డు మీద వీరంగం సృష్టిస్తున్నారు. కార్లు, బైక్‌లతో రేసింగ్‌లు చేస్తూ.. రెక్లెస్‌గా డ్రైవ్ చేస్తున్నారు. ఏమాత్రం కంట్రోల్ లేకుండా బండ్లు నడుపుతూ, వాళ్ల ప్రాణాలతో పాటు పక్కన వెళ్లే వాళ్ళ ప్రాణాలను కూడా గాలిలో కలిపేస్తున్నారు. తరచూ ఓఆర్ఆర్ మీద జరుగుతున్న ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు.. వీళ్ళ ఈ నిర్లక్ష్యమే అసలు కారణం అవుతోంది.నిన్న శుక్రవారం రాత్రి కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై అచ్చం ఇలాంటి సీనే కనిపించింది. కొందరు యువకులు ట్రాఫిక్ రూల్స్ గాలికి వదిలేసి, డోర్ పై కూర్చొని ప్రమాదకరమైన విన్యాసాలు,పక్కన వెళ్లేవాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది.అసలు వీళ్లకి చట్టం అంటే భయం ఉందా? పోలీసుల నిఘా ఏమైంది? ఇంకెన్ని ప్రాణాలు పోతే ఈ తీరు మారుతుంది? ఇప్పుడిదే అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముందు చక్రం ఊడి కుప్పకూలిన విమానం

Weather Update: గెట్ రెడీ.. వరుణుడు వచ్చేస్తున్నాడు! తెలుగు రాష్ట్రాలకు వర్షాల సందడి!

రూ. 2 లక్షల విలువైన పరుపులు ఇచ్చి.. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన తండ్రీ కొడుకులు!

ఏఐ గురువులకు ఫుల్ డిమాండ్.. ఒక్క క్లాస్ చెబితే రూ. 23 లక్షల ఫీజు

ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్‌

Follow Us