పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!
నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను స్వయంగా ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరిస్తోంది. చిన్నారుల్లో కొన్ని దగ్గు మందుల వినియోగంపై భద్రతా ఆందోళనల నేపథ్యంలో సిరప్ బాటిళ్లపై స్పష్టమైన హెచ్చరికలను ముద్రించేలా నిబంధనల్లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పిల్లలకు మందులు ఇచ్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం, లేబుల్‌పై ఉన్న సూచనలు పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లలకు జలుబు, దగ్గు చేస్తే వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్లి దగ్గు సిరప్ కొని తాగించేస్తుంటారు చాలామంది. అయితే, నాలుగేళ్లలోపు పసిపిల్లలకు దగ్గు సిరప్‌లు వాడటం అత్యంత ప్రమాదకరమని, వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని భారత కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. చిన్నపిల్లలకు దగ్గు సిరప్‌లు వాడకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సిరప్ సీసాపై ఎరుపు రంగులో పెద్ద హెచ్చరిక ముద్రించేలా ‘డ్రగ్స్ రూల్స్, 1945’కు సవరణలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. “4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ సిరప్ వాడకూడదు” అని స్పష్టమైన హెచ్చరికతో పాటు, నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా బడికి వెళ్లే పిల్లల బొమ్మలను లేబుల్‌పై ముద్రించాలని ప్రతిపాదించారు. చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సిరప్‌లలో ఉండే కొన్ని రసాయనాల వల్ల పసిపిల్లల్లో మత్తు రావడం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడటం, ప్రాణాంతక దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో హెచ్చరికలు ఇచ్చినప్పటికీ విచ్చలవిడిగా ఈ సిరప్‌లను వాడుతుండటంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇకనైనా తల్లిదండ్రులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే
