Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె కడుపులో ఉన్నది చూసి .. స్టన్ అయిన వైద్యులు వీడియో

ఆమె కడుపులో ఉన్నది చూసి .. స్టన్ అయిన వైద్యులు వీడియో

Samatha J
|

Updated on: Jul 03, 2025 | 11:02 AM

Share

అల్జీరియాలో 73 ఏళ్ల మహిళ గర్భంలో 30 ఏళ్లుగా ఉన్న రాతి బిడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ అరుదైన పరిస్థితిని లిథోపీడియాన్ అని పిలుస్తారు. ఇందుకు సంబంధించిన సీటీ స్కాన్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి

లిథోపీడియాన్ అనేది చాలా అరుదుగా కనిపించే వైద్య స్థితి. గర్భాశయానికి బదులుగా గర్భం.. కడుపులో ఏర్పడిన కేసుల్లో ఈ సమస్య వస్తుంది. ఈ పిండానికి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ అది విఫలమవుతుంది. అయితే శరీరానికి ఫీటస్‌ను సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే.. శరీరం రక్షణాత్మక చర్యగా ఫీటస్‌ను శిలాజంగా మార్చేస్తుంది. 2013లో కూడా కొలంబియాలో 82 ఏళ్ల మహిళకు 40 ఏళ్ల క్రితం గర్భం విఫలమై, ఆ ఫీటస్ శరీరంలోనే రాతిగా మారిపోయినట్లు గుర్తించారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 సార్లు మాత్రమే నమోదయినట్లు మెడికల్ డేటా చెబుతోంది. ఈమె వైద్య రిపోర్టులు చూసిన నెటిజన్లు ‘ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా?’, ‘ఇది నిజమా? ఎలా సాధ్యం?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో

ఓవర్ థింకింగ్‌కు భగవద్గీత 5 పరిష్కారాలు వీడియో

ఆడుకుందామని గ్రౌండ్‌కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో

శివాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము వీడియో