యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన

Updated on: Aug 10, 2026 | 4:43 PM

యూపీఐ సేవలు సాధారణ పౌరులకు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజువారీ లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండవని తెలిపింది. భవిష్యత్తులో MDR విధించినా అది పరిమిత వ్యాపార లావాదేవీలకే నామమాత్రంగా వర్తిస్తుందని వెల్లడించింది. సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలకు యూపీఐ విస్తరణ లక్ష్యంగా చట్ట సవరణలు చేపడుతున్నట్లు పేర్కొంది.

భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూపీఐ సేవలు పౌరులకు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజువారీ లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండవని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఒకవేళ MDR రుసుములు విధిస్తే, అవి అత్యంత నామమాత్రంగా వ్యాపారుల పరిమిత లావాదేవీలకే వర్తిస్తాయని వెల్లడించింది.టాక్సేషన్, పీఎస్ఎస్ చట్ట సవరణల వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం తెలిపింది. సైబర్ నేరాలను అరికట్టడం, సాంకేతిక మౌలిక సదుపాయాలను నవీకరించడం, ఈ రంగంలో పోటీని పెంచడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. బాహ్య ఒత్తిళ్ల వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్రం ఖండించింది. భారత్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల తదుపరి దశకు చేరువైంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు యూపీఐని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. యూపీఐ వ్యవస్థ రాబోయే దశాబ్దాల పాటు సురక్షితంగా, సులువుగా పనిచేసేందుకే ఈ చట్ట సవరణలు చేపట్టినట్లు పునరుద్ఘాటించింది. 2016-17లో ప్రారంభమైన యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా ఎదిగింది. 2026 జూలై నెలలోనే రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల లావాదేవీలను ఇది నమోదు చేసింది. ప్రస్తుతం భారత్‌తో పాటు 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ భారతీయుల గొప్ప జాతీయ విజయమని, దీని వెనుక ప్రభుత్వం నిరంతరం ఉంటుందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!

Loading...
Unable to load recommendations.
Follow Us