Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు ఊగిసలాటలో ఉన్నాయి. ఫిబ్రవరి 5న పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.5,020 తగ్గి రూ.1,54,420; 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.4,600 తగ్గి రూ.1,41,550కి చేరింది. వెండి కిలో రూ.20,000 తగ్గి రూ.3,00,000 పలుకుతోంది. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన.
బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో పసిడి ప్రియులకు అంతు చిక్కడం లేదు. ఒకరోజు పెరిగితో మర్నాడు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.జనవరి నెలలో పసిడి ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. ఇక ఫిబ్రవరి వచ్చేసరికి బంగారం ధరలు ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఊగిసలాట మధ్య కదలాడుతున్నాయి. ఇక ఫిబ్రవరి 5 గురువారం పసిడి ధరల విషయానికి వస్తే బంగారం ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారంపై రూ.5,020 తగ్గి 10 గ్రాములు ధర రూ.1,54,420లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.4,600 లు తగ్గి రూ.1,41,550లు పలుకుతోంది. వెండి కిలోపై రూ.20,000 తగ్గి రూ.3,00,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,54,570 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,700 గా కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా లో 24 క్యారెట్ల బంగారంపై రూ.6,600 తగ్గి రూ.1,60,530, 22 క్యారెట్ల బంగారంపై రూ. 6,050లు తగ్గి రూ.1,47,150 లు గా కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,220 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,420 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,550 పలుకుతోంది. కిలో వెండి పై రూ.20,000 తగ్గి రూ.3,00,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్‌లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??
Ram Charan: నెక్ట్స్ లెవల్‌లో మెగా డెడికేషన్.. ఎన్ని జరిగినా ఆగేదెలే
Rakul Preet Singh: బాలీవుడ్ పీఆర్ వ్యవస్థపై రకుల్ సీరియస్ కామెంట్స్
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్