తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

Updated on: Mar 18, 2026 | 6:24 PM

తెలంగాణ రవాణా శాఖ మార్చి 23 నుండి కేంద్ర 'వాహన్' నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుంది. దీంతో రెండో వాహనం కొనుగోలుపై అదనపు 2% లైఫ్ ట్యాక్స్ పూర్తిగా రద్దవుతుంది, సుమారు రూ.20,000 వరకు ఆదా అవుతుంది. డూప్లికేట్ ఆర్సీ, పేరు మార్పు వంటి ఆర్‌టీఏ సేవలు ఇకపై ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ఇది వాహనదారులకు సమయం, డబ్బు ఆదా చేసి, పారదర్శకతను పెంచుతుంది.

తెలంగాణ రవాణా వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 23 నుంచి రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ (VAHAN) నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది. దీనివల్ల తెలంగాణ వాహనాల వివరాలన్నీ ఇకపై జాతీయ స్థాయి డేటాబేస్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మార్పుతో వాహనదారులకు లభించే అతిపెద్ద వరం.. రెండో వాహనంపై అదనపు పన్ను రద్దు. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా కట్టాల్సిన 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఉదాహరణకు, రూ. 10 లక్షల కారుపై సుమారు రూ.20 వేల వరకు ఆదా అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు అవసరమయ్యే మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ‘వాహన్’ వ్యవస్థ అమల్లోకి వస్తే ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, పేరు మార్పు, లోన్ ఎంట్రీ లేదా క్యాన్సిలేషన్ వంటి పనులను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల బ్రోకర్ల బెడద తప్పడమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో వాహనాల క్రయవిక్రయాలు కూడా సులభతరం అవుతాయి. మొత్తానికి ఈ సంస్కరణలు వాహనదారుల సమయాన్ని, డబ్బును ఆదా చేస్తూ రవాణా సేవల్లో పారదర్శకతను తీసుకురానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

ఉగాదికి వేప పువ్వు దొరికేనా ?? వేపచెట్లకు ఏమైంది ??

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

Follow Us