2000 Notes: డెడ్ లైన్ తర్వాత రూ.2000 నోటును మార్చలేమా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ.
మీ దగ్గర ఇంకా 2000 నోట్లు ఉండిపోయాయా. నేటితో ఈ నోట్లు మార్చుకునే గడువు పూర్తియిపోతోంది. మరి మిగిలి ఉన్న నోట్లను మార్చుకోవడం ఎలా? కంగారు పడకండి.. ఈ విషయమై ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి అక్టోబరు 7 వరకు పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది.
మీ దగ్గర ఇంకా 2000 నోట్లు ఉండిపోయాయా. నేటితో ఈ నోట్లు మార్చుకునే గడువు పూర్తియిపోతోంది. మరి మిగిలి ఉన్న నోట్లను మార్చుకోవడం ఎలా? కంగారు పడకండి.. ఈ విషయమై ఆర్బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి అక్టోబరు 7 వరకు పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే గడువు ముగిసిన తర్వాత కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించే సమయానికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయన్నారు. 2 వేల నోట్ల మార్పిడి గడువును తొలుత సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అయితే 8వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దాదాపు ప్రతి రాష్ట్ర రాజధానిలోను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించలేని పక్షంలో వారు తపాలా శాఖ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..