వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!

Updated on: Sep 27, 2026 | 12:19 PM

దేశంలోని హైస్పీడ్‌ జాతీయ రహదారులపై టోల్‌ చెల్లింపు విధానంలో భారీ మార్పులు రానున్నాయి. NHAI మల్టీ-లేన్‌ ఫ్రీ-ఫ్లో టోలింగ్‌ విధానాన్ని తీసుకురానుంది. ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ ద్వారా వాహనాలు ఆగకుండానే టోల్‌ వసూలు చేయనున్నారు. కొత్త రహదారుల నిర్మాణంలో AI ఆధారిత సాంకేతికతతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, వర్షపు నీటి నిల్వ, పచ్చదనం పెంపుపై కూడా దృష్టి పెట్టనున్నారు.

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సరికొత్త మార్గదర్శకాలతో దేశంలోని హైస్పీడ్ జాతీయ రహదారుల రూపురేఖలను మార్చబోతోంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బ్రేక్ వేసి ఆగాల్సిన అవసరం లేకుండా ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్ విధానాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ మరియు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతల ద్వారా వాహనాలు వేగంగా కదులుతుండగానే టోల్ రుసుము ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఇప్పటికే గుజరాత్‌లోని NH-48పై ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ కొత్త నిబంధనలు రాబోయే 4, 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ రహదారులకు వర్తిస్తాయి. భవిష్యత్ ట్రాఫిక్‌ను ముందస్తుగా అంచనా వేసి, రోడ్ల నిర్మాణంలో ఆటోమేటెడ్, ఇంటెలిజెంట్ మెషిన్-ఎయిడెడ్ కన్స్ట్రక్షన్ (AI-MC) సాంకేతికతను వాడనున్నారు. దీనివల్ల రోడ్ల నాణ్యత, నిర్మాణం గణనీయంగా మెరుగుపడతాయి. కేవలం ప్రయాణ వేగమే కాకుండా పర్యావరణ పరిరక్షణకూ పెద్దపీట వేస్తున్నారు. హైవేల మధ్యలో, ఫ్లైఓవర్ల కింద మొక్కలు పెంచడం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయడం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ప్రాజెక్ట్ డిజైన్‌లోనే చేర్చడం వంటి చర్యలు చేపట్టనున్నారు. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికత, పర్యావరణ స్పృహ కలయికగా భవిష్యత్ రహదారులను తీర్చిదిద్దడమే NHAI ప్రధాన లక్ష్యం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

పాలకూట విషం.. సూదిమందులతో ప్రజలు, పశువుల ప్రాణాలతో చెలగాటం!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు

The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

Loading...
Unable to load recommendations.
Follow Us