PUC Rules 2026: కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి భారీ ఊరట!

Updated on: Nov 23, 2026 | 7:21 AM

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై వాహనాల వయసు, ఎమిషన్ ప్రమాణాలను బట్టి PUC గడువు మారనుంది. ముఖ్యంగా కొత్త BS6 వాహనాలకు భారీ ఊరట లభించింది, పాత వాహనాలకు కఠిన నిబంధనలు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాహనదారులకు తీపి కబురు అందించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కొత్త నియమావళిని నోటిఫై చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 13న ఈ మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై వాహనాల వయసు, వాటి ఎమిషన్ ప్రమాణాలను బట్టి PUC సర్టిఫికేట్ గడువు మారనుంది. ముఖ్యంగా BS6 ప్రమాణాలతో నడిచే ప్రైవేట్ వాహనదారులకు ఈ మార్పులు భారీ ఊరటను కల్పించాయి. ఆరేళ్ల లోపు వయసున్న BS6 కార్లకు ఇకపై మూడేళ్ల వరకు PUC సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. ఆరేళ్లు దాటి పదేళ్ల లోపు వాహనాలకు ఏడాది గడువు ఉండగా, పదేళ్లు దాటిన వాహనాలకు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి PUC పరీక్ష చేయించుకోవాలి. BS6 కమర్షియల్ వాహనాలకు ఆరేళ్ల లోపు రెండేళ్ల గడువు, ఆరేళ్లు దాటి పదేళ్ల లోపు వాహనాలకు ఏడాది, పదేళ్లు దాటిన వాటికి ఆరు నెలల గడువు వర్తిస్తుంది. పాత వాహనాలకు సంబంధించి, BS1, BS2, BS3 వాహనాలకు మూడు నెలలు, BS4 వాహనాలకు ఆరు నెలల పాటు PUC సర్టిఫికేట్ చెల్లుతుంది. గతంలో రాష్ట్రాలను బట్టి PUC గడువులో తేడాలు ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే జారీ చేసిన PUC సర్టిఫికెట్ల గడువు వాటి ఎక్స్పైరీ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకునేటప్పుడు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. వాహనం వయసును మొదటి రిజిస్ట్రేషన్ తేదీ నుంచి లెక్కిస్తారు. కొత్త BS6 కార్లకు తరుచూ PUC సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అయితే పాత వాహనాలకు కాలుష్య పరీక్షలు తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.9 కోట్ల మందు.. ఇప్పుడు రూ.2.5 లక్షలకే! ఈ డాక్టర్ నిజంగా దేవత..

మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి! ఇదో కొత్త సైబర్ దోపిడీ..

ఏపీలో కోటికి పైగా బీపీ, షుగర్ కేసులు.. 3 జిల్లాల్లో పరిస్థితి దారుణం

Loading...
Unable to load recommendations.
Follow Us