LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!

Updated on: Apr 30, 2026 | 4:26 PM

మే 1 నుండి LPG గ్యాస్ సిలిండర్ల నిబంధనలు మారనున్నాయి. ధరలు పెరుగుదల, బుకింగ్ పద్ధతుల్లో మార్పులు, OTP డెలివరీ తప్పనిసరి, Ujjwala eKYC వంటివి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం కారణంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి. మీ కనెక్షన్ సురక్షితంగా ఉండాలంటే KYC, మొబైల్ నంబర్ వివరాలను తనిఖీ చేసుకోండి. పైప్డ్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్రతి ఇంట్లో వంటగదిలో అత్యవసరంగా ఉపయోగించే LPG గ్యాస్ సిలిండర్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఒకే ప్రశ్న అడుగుతున్నాయి. మే 1 నుంచి గ్యాస్ రూల్స్ మారబోతున్నాయా? ధరలు మళ్లీ పెరుగుతాయా? బుకింగ్ విధానం కఠినం కాబోతుందా? ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో మొదలైన ఘర్షణలు ప్రపంచ ఇంధన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. సరఫరాలో కొరత, డెలివరీల్లో ఆలస్యం, ధరల్లో పెరుగుదల స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో భారత్ సహా పలు దేశాలు LPG గ్యాస్ సరఫరాలో సమస్యలను ఎదుర్కోవడానికి కొత్త నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. మే 1 నుంచి LPG సిలిండర్ ధరల్లో మరోసారి మార్పులు జరగొచ్చు. ఇప్పటికే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను కంపెనీలు రూ.60 వరకు పెంచాయి. మరోవైపు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు క్రమంగా పెరుగుతూ వ్యాపారస్తులకు భారంగా మారాయి. ఏప్రిల్‌లో మెట్రో నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు సమారుగా రూ.218 మేర పెరిగాయి. ఈ పెరుగుదల ఒక్కసారిగా జరగకపోయినా, క్రమంగా పెరుగుతూ రావడం వల్ల హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పుడు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్న విషయం బుకింగ్ రూల్స్‌లో మార్పులు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ 45 రోజులు ఉంది. అయితే సరఫరా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవధిని మార్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. మరో కీలక అంశం OTP ఆధారిత డెలివరీ విధానం. ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇప్పుడు శాశ్వతంగా మారే అవకాశముంది. అంటే మీ గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అయ్యే సమయంలో మీ మొబైల్‌కు వచ్చే OTP చెప్పిన తర్వాత మాత్రమే డెలివరీ పూర్తి అవుతుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం సిలిండర్ దుర్వినియోగాన్ని అరికట్టడం, సరైన వినియోగదారుడికి మాత్రమే సరఫరా జరిగేలా చూడటం. ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలో గృహ వినియోగ LPG, PNG అలాగే CNG సరఫరా 100 శాతం కొనసాగుతోంది. ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం. ఆన్‌లైన్ బుకింగ్ విధానం కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. దాదాపు 98 శాతం బుకింగ్స్ పెరిగాయని సమాచారం. అంటే ఎక్కువ మంది ఇప్పుడు యాప్, వెబ్‌సైట్ లేదా మొబైల్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తున్నారు. అదే విధంగా డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ ఆధారంగా జరిగే డెలివరీలు కూడా 94 శాతం వరకు పెరిగాయి. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి సరఫరా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కొన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఔషధ తయారీ సంస్థలు, స్టీల్ పరిశ్రమ, ఆటోమొబైల్, వ్యవసాయ సంబంధిత రంగాలకు ముందు గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. వలస కార్మికుల కోసం 5 కిలోల LPG సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేసారు. ఇది సాధారణంగా చిన్న కుటుంబాలకు , తాత్కాలిక నివాసాల్లో ఉండే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత eKYC తప్పనిసరి చేశారు. ఇంకా eKYC పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరినీ ఎక్కువగా కలవరపెడుతున్న విషయం కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం. కొన్ని తాజా మార్గదర్శకాల ప్రకారం అవసరమైన KYC పూర్తి చేయకపోతే 3 నెలల తర్వాత కనెక్షన్ నిలిపేసే అవకాశముంది. ఇక మరో పెద్ద మార్పు PNG కనెక్షన్ల కు ప్రోత్సాహం. నగరవాసులు LPG నుంచి piped gas PNG కి మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. PNG వినియోగం ద్వారా సరఫరా సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే నగరాల్లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, కమర్షియల్ వినియోగదారులను PNG కనెక్షన్ తీసుకోవాలని కోరుతోంది. అప్లికేషన్‌ ప్రక్రియ కూడా సులభంగా ఈమెయిల్ లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ పోర్టల్ ద్వారా అప్లై చేసే అవకాశం కల్పించారు. ఈ మార్పులన్నీ చూస్తుంటే మే నెల నుంచి గ్యాస్ వినియోగదారులకు కొత్త నిబంధనలు మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ధరలు, బుకింగ్ రూల్స్, OTP డెలివరీ, eKYC, కనెక్షన్ అప్డేట్స్‌పై అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడే మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు, KYC స్టేటస్‌, బుకింగ్ హిస్టరీ చెక్ చేసుకోవడం మంచిది. చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో డెలివరీ ఆలస్యం లేదా కనెక్షన్ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మే 1 తర్వాత ఏ మార్పులు అమల్లోకి వస్తాయో అధికారిక ప్రకటనలపై దృష్టి ఉంచాలి. ఎందుకంటే ఈ నిర్ణయాలు ప్రతి ఇంటి నెలవారీ ఖర్చుపై నేరుగా ప్రభావం చూపుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

చరణ్ మెరుపు సినిమా ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది ??

Dacoit OTT: అప్పుడే OTTలోకి ‘డెకాయిట్’.. ఎప్పుడంటే

Michael: మైఖేల్‌ దెబ్బకు.. బద్దలైన ధురంధర్ 2 రికార్డ్

Follow Us