అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు

Updated on: Jun 07, 2026 | 4:33 PM

అండమాన్ బేసిన్‌లో మరోసారి సహజ వాయువు నిక్షేపాలు వెలుగులోకి రావడం భారత ఇంధన రంగానికి శుభవార్తగా మారింది. విజయాపురం-3 బావిలో గ్యాస్ లభించగా, గతంలో విజయాపురం-2లో కూడా నిక్షేపాలు గుర్తించారు. వరుసగా రెండు విజయవంతమైన ఆవిష్కరణలతో అండమాన్ ప్రాంతం దేశంలోని కీలక హైడ్రోకార్బన్ ఉత్పత్తి కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇంధన స్వావలంబనకు బలాన్నివ్వనుంది.

అండమాన్ సముద్ర తీరంలో మరోసారి సహజ వాయువు నిక్షేపాలు బయటపడ్డాయి. భారత ఇంధన రంగంలో ఇది ఓ కీలక పరిణామం. రాబోయే సంవత్సరాల్లో అండమాన్ బేసిన్ దేశంలోని కీలక హైడ్రోకార్బన్ ఉత్పత్తి ప్రాంతంగా మారే అవకాశం ఉంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. అండమాన్ దీవులకి 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల నీటి లోతులో విజయాపురం-3 బావిలో ఈ గ్యాస్ బయటపడింది. ఆయిల్ ఇండియా డ్రిల్ చేసిన బావుల్లో గ్యాస్ లభించడం ఇది రెండోసారి. అంతకుముందు 2025 సెప్టెంబర్‌లో విజయాపురం-2 బావిలో సహజ వాయువును కనుగొన్నారు. అండమాన్ దీవుల తూర్పు తీరంలో 17 కి.మీ దూరంలో 295 మీటర్ల నీటి లోతు, 2650 మీటర్ల టార్గెటెడ్ లోతులో ఉన్న విజయాపురం-2 బావి వద్ద నిక్షేపాలను గుర్తించారు. ఈ ప్రాంతంలో 2 లక్షల కోట్ల లీటర్ల భారీ చమురు నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇది వెలికితీస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 20 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు అండమాన్‌లో ఆయిల్ ఇండియా చేపట్టిన అన్వేషణ కార్యక్రమంలో మూడు బావులను డ్రిల్ చేయగా, వాటిలో రెండు చోట్ల హైడ్రోకార్బన్ల ఉనికి నిర్ధారణ అయింది. ఇది అండమాన్ బేసిన్‌లో భవిష్యత్ అన్వేషణలకు మంచి సంకేతమని భావిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడకుండా, ఇంధన భద్రతను పెంచడంతో పాటు చమురు, గ్యాస్ ఉత్పత్తిలో స్వావలంబనకు ఈ నిక్షేపాలు సహాయపడతాయి. వరుసగా రెండుసార్లు గ్యాస్ నిక్షేపాలు బయటపడటంతో ఇంతకాలం పెద్దగా అన్వేషణ జరగని అండమాన్ బేసిన్ ఇప్పుడు దేశంలోని అత్యంత ఆశాజనకమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ఆవిష్కరణలు ఈ ప్రాంతంలో మరిన్ని హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉన్నట్టు సూచిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Buchi Babu: జాన్వీని రోల్ పై విర్శలు.. వివరణ ఇచ్చిన బుచ్చి

హస్కీ వాయిస్‌తో తియ్యగా మాట్లాడి.. కోట్లలో ముంచేసిందిగా

Follow Us