కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

Updated on: Nov 03, 2026 | 1:06 PM

దేశంలో అక్టోబర్‌ నెల జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 22.9 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులపై పన్ను ఆదాయం ఏకంగా 42.2 శాతం వృద్ధి చెందగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 15.8 శాతం పెరిగింది. రిఫండ్లు మినహాయించిన నికర జీఎస్టీ ఆదాయం రూ.2.03 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య కూడా వసూళ్లలో వృద్ధి కనిపించింది.

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో 22.9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను ఆదాయం పెరగడం ఇందుకు దోహదం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గతేడాది అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.88 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించగా నికర ఆదాయం 25.6 శాతం పెరిగి రూ.2.03 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే నెలలో ఇది రూ.1.61 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 15.8 శాతం పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరింది. దిగుమతులపై పన్ను వసూళ్లు మాత్రం 42.2 శాతం దూసుకెళ్లి రూ.72,246 కోట్లకు చేరాయి. గతేడాది అక్టోబర్‌లో దిగుమతులపై ఐజీఎస్టీ వసూళ్లు రూ.50,796 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు 13.2 శాతం పెరిగి రూ.14.77 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ.13.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నికర వసూళ్లు సైతం 12.6 శాతం వృద్ధితో రూ.12.69 లక్షల కోట్లకు చేరాయి. అక్టోబర్‌లో పన్ను రిఫండ్లు 6.5 శాతం పెరిగి రూ.27,934 కోట్లకు చేరాయి. దేశీయ రిఫండ్లు రూ.14,007 కోట్లు కాగా, ఎగుమతులకు సంబంధించిన రిఫండ్లు రూ.13,927 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య మొత్తం రిఫండ్లు 16.9 శాతం పెరిగి రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ

ఇకపై తెలంగాణలో ఇన్‌స్టంట్ పింఛన్!ఎవరు అర్హులు?ఏ పత్రాలు కావాలి? ఎలా అప్లై చేయాలి?

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది!

తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా?..‘జీతం కట్’ అంటోన్న తెలంగాణ సర్కారు

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ భారీ ఆఫర్. ముఖం మీదే తిరస్కరించి రోహిత్

Loading...
Unable to load recommendations.
Follow Us