వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

Updated on: Mar 21, 2026 | 12:22 PM

కేంద్ర పెట్రోలియం శాఖ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత వార్తలను ఖండించింది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. LPG ఉత్పత్తిని 40% పెంచి, పంపిణీ పారదర్శకతకు కొత్త విధానాలు తెచ్చింది. వాణిజ్య అవసరాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని ప్రోత్సహిస్తూ, స్వచ్ఛమైన ఇంధన నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో అనవసరంగా నిల్వ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని 40 శాతం పెంచినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిలిండర్ల సరఫరాలో ఎటువంటి జాప్యం లేదని, పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకు ‘డెలివరీ అథెంటికేషన్ కోడ్’, ఆన్‌లైన్ బుకింగ్‌లను తప్పనిసరి చేశామని తెలిపింది. పెట్రోల్, డీజిల్ దిగుమతుల అవసరం లేకుండా దేశీయంగానే సరిపడా ఉత్పత్తి జరుగుతోందని స్పష్టం చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ వాడకాన్ని తగ్గించి, పైప్డ్ నేచురల్ గ్యాస్ వైపు మళ్లేలా రాష్ట్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలా పీఎన్జీ కనెక్షన్లు పెంచే రాష్ట్రాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించనున్నట్లు ప్రకటించింది. హోటళ్లు, ఆసుపత్రులు వంటి సంస్థలు పీఎన్జీ వైపు మారితే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రత్యేక రాయితీలు ఇస్తాయని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను అదనంగా కేటాయించింది. గృహ అవసరాలు మరియు సీఎన్జీ రవాణా వంటి కీలక రంగాలకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రం పునరుద్ఘాటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ

Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

Follow Us