Silver Price Fall: అయ్యో వెండి ఎంత పని చేసావే..
బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పతనమవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన ధరలు కేవలం కొన్ని రోజుల్లోనే భారీగా దిగివచ్చాయి. కొనుగోలుదారులు సంతోషిస్తుండగా, ఇప్పటికే కొనుగోలు చేసిన వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగం తర్వాత డాలర్ బలోపేతం, ట్రెజరీ బాండ్ల రాబడి, లాభాల స్వీకరణ వంటి కారణాలతో ధరలు పడిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం, వెండి ధరలు ఇటీవల అనూహ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి, రజితం ధరలు ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. గత గురువారం 10 గ్రాముల బంగారం ధర లక్షా 90 వేల రూపాయలకు చేరి ఆల్ టైం రికార్డు సృష్టించింది. అయితే కేవలం నాలుగైదు రోజుల్లోనే 40 వేల రూపాయల కరెక్షన్ తీసుకొని లక్షా 50 వేలకు దిగివచ్చింది. ఇదే ధోరణి కొనసాగితే వారం రోజుల్లో లక్ష రూపాయలకు చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పార్టీ నేతలపై పవన్ అసంతృప్తి.. కారణం ఏంటి
MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ
వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్
