PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!
ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ సేవలను మొబైల్లోనే పొందవచ్చు. యూఏఎన్ జనరేట్ చేయడం, యాక్టివేట్ చేయడం, పీఎఫ్ పాస్‌బుక్ తనిఖీ, బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవడం, విత్‌డ్రా క్లెయిమ్‌లు సమర్పించడం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణతో కొన్ని సేవలను పూర్తి చేయవచ్చు. సమర్పించిన క్లెయిమ్ స్థితిని కూడా యాప్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఉపశమనాన్ని అందించింది. పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఉద్యోగులు తమ మొబైల్ నుంచే ఉమాంగ్ యాప్ ద్వారా సమస్త ఈపీఎఫ్ఓ సేవలను పొందే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ యాప్.. ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడానికి యాక్టివ్ యూఏఎన్ , ఆధార్ కార్డ్ మరియు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. కొత్తగా చేరిన ఉద్యోగులు ఉమాంగ్ యాప్‌లోని ‘UAN కేటాయింపు, యాక్టివేషన్’ విభాగంలో ఆధార్, మొబైల్ వివరాలు నమోదు చేసి UAN పొందే అవకాశం ఉంది. ఆధార్ ఫేస్ RD యాప్ ద్వారా ముఖ ధృవీకరణ పూర్తి కాగానే కొత్త UAN జనరేట్ అయి ఉద్యోగి ఫోన్‌కు వస్తుంది. ఇప్పటికే UAN ఉండి యాక్టివేట్ చేసుకోని వారు కూడా ఫేస్ స్కానింగ్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకుని తాత్కాలిక పాస్వర్డ్ పొందవచ్చు. అంతేకాకుండా, ఉద్యోగులు ఈ యాప్ ద్వారా ఎప్పుడైనా తమ ఈపీఎఫ్ పాస్‌బుక్ తనిఖీ చేసుకుని, నెలవారీ చందా, వడ్డీ వివరాలను తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో అడ్వాన్స్ నిధులు, తుది సెటిల్మెంట్ లేదా పెన్షన్ విత్‌డ్రా కోసం ఆన్లైన్ ద్వారానే క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం సరిగ్గా అప్డేట్ అయి ఉంటే ఎలాంటి అంతరాయం లేకుండా క్లెయిమ్స్ మంజూరవుతాయి. సమర్పించిన క్లెయిమ్ స్టేటస్‌ను కూడా యాప్‌లోనే ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!
డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. RRB NTPC నోటిఫికేషన్ విడుదల!
