LPG Price: దీపావళి వేళ గ్యాస్ ధరల బాంబు..

Updated on: Nov 03, 2026 | 4:34 PM

దీపావళి వేళ వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. వరుసగా మూడో నెల 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.10 పెంచాయి. నవంబర్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.3,065 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలోనూ ధరలు పెరిగాయి. గృహ గ్యాస్‌ ధరల్లో మాత్రం మార్పు లేకపోవడంతో సామాన్యులకు కొంత ఊరట లభించింది.

దీపావళి పండుగ వేళ చమురు మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా మూడో నెలలోనూ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.10 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడులు కొనసాగుతుండటంతోనే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరలు దాదాపు రూ.3,000లకు చేరువయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,820కి చేరగా.. ముంబైలో రూ.2,774.50, కోల్‌కతాలో రూ.2,964, చెన్నైలో రూ.2,994.50గా నమోదైంది. ఇటు హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు ఏకంగా రూ.3,000 మార్కును దాటేసింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో ఒక్కో సిలిండర్ ధర రూ.3,065 పైగా ప‌లుకుతోంది. దీనికి అదనంగా డెలివరీ ఛార్జీలు కూడా వసూలు చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల అక్టోబర్ 1న కూడా రూ.62.50 పెంచింది. వరుస పెంపుల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ కోర్టుల నిర్వహణ మరింత భారంగా మారనుంది. వ్యాపారుల అదనపు భారం చివరికి కస్టమర్లపైనే పడే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. సన్నబియ్యం ధరలకు కళ్లెం!

కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు

నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ

Published on: Nov 03, 2026 04:24 PM
Loading...
Unable to load recommendations.
Follow Us