Toll Plaza: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌.. రూ.1500కే వార్షిక లోకల్ పాస్‌

Updated on: Nov 21, 2026 | 3:56 PM

టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలకు రూ.360 చెల్లించే లోకల్ పాస్‌కు బదులుగా ఏడాదికి రూ.1,500తో వార్షిక పాస్ అందిస్తోంది. దీని ద్వారా ఏడాదికి రూ.2,820 వరకు ఆదా చేసుకోవచ్చు. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత కార్లకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.

టోల్‌ప్లాజా సమీపంలో నివసించే స్థానిక వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రాయితీతో కూడిన సరికొత్త వార్షిక లోకల్‌ పాస్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 1 నుంచే ఈ సేవలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు నెలవారీ లోకల్‌ పాస్‌ ధర రూ.360 ఉండగా, ఇప్పుడు ఏడాది కాలానికి గాను రూ.1,500 చెల్లించి వార్షిక పాస్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి నెలా లోకల్‌ పాస్ తీసుకునేవారితో పోలిస్తే, ఈ వార్షిక పాస్ తీసుకోవడం ద్వారా వాహనదారులకు ఏడాదికి ఏకంగా రూ.2,820 వరకు ఆదా అవుతుంది. ఉమ్మడి జిల్లాలోని హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, అలాగే హైదరాబాద్‌-భూపాలపట్నం హైవేపై గూడురు టోల్‌ప్లాజాల పరిధిలోని స్థానికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. కేవలం వ్యక్తిగత కార్లు, వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ప్రయాణికులు టోల్‌ప్లాజా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ పాస్‌ను పొందవచ్చు. యాప్‌లో చిరునామా, ఫాస్టాగ్‌ వివరాలు నమోదు చేస్తే, జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నివాస ప్రాంతం 20 కి.మీ. లోపు ఉందో లేదో పరిశీలించి పాస్‌ను మంజూరు చేస్తారు. కారు ఆర్‌సీ, ఆధార్, ఓటర్‌ కార్డ్‌లోని చిరునామా ఒకేలా ఉండాలి. అయితే, నెలవారీ పాస్ తీసుకునేవారు ప్రతి నెలా మొదటి తేదీనే రెన్యూవల్ చేసుకోవడం మంచిది. నెల మధ్యలో తీసుకున్నా ఆ నెల చివరి వరకే అది పనిచేస్తుంది. అదే వార్షిక పాస్ అయితే నేరుగా ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. టోల్‌ప్లాజా సమీపంలోని ప్రజలందరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..

Inspiring Mother: చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!

NHAI: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్!

New Building Rules: బిల్డింగ్ రూల్స్‌ మారుతున్నాయ్‌..ఇల్లు కట్టుకోవడం ఇక ఈజీ..

Samantha: గాయత్రీ హోమ ఫలితం.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత

Loading...
Unable to load recommendations.
Follow Us