Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Updated on: Oct 17, 2026 | 5:46 PM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అక్టోబర్‌ 22 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు కథనం పేర్కొంది. తిరుమల, తిరుపతి, గోకవరం, రాజమహేంద్రవరం, మన్యం ప్రాంతాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. పిడుగులు, బలమైన గాలుల ముప్పు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్టోబర్ 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య రుతుపవనాల రాక, దక్షిణ కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వానలు జోరందుకుంటాయని తెలిపింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. అందులో ఒకటి తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుతో పాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.అలాగే లక్షద్వీపం ఉత్తర ప్రాంతాల నుంచి కేరళ, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులను గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షంలో తడుస్తున్న భక్తుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని వారికి వెంటనే ఉచితంగా గొడుగులు, టార్పాలిన్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన ఈ వానకు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన గంటపాటు ఎడతెరపి లేకుండా కురిసింది. ఈ భారీ వర్షంతో గోకవరంలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వాతావరణం ఒక్కసారిగా మారి పలుచోట్ల అకాల వర్షం కురిసింది. మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా కురిసిన ఈ వాన కారణంగా నగరంలోని ప్రధాన వీధుల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు తలదాచుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అలాగే రహదారుల పక్కన చిన్నపాటి వ్యాపారాలు నిర్వహించే దుకాణదారులు సరుకులు తడవకుండా కాపాడుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. అకస్మాత్తుగా పడిన వర్షంతో నగరంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది. రాయలసీమలో శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. పిడుగులు, మెరుపులకు అవకాశం ఉండటంతో పాటు గంటకు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చు. సోమవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాల తీవ్రత పెరిగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు మునుపెన్నడూ లేని విధంగా ఆందోళనకరంగా మారుతున్నాయి. తాగునీటి రంగానికి ప్రధాన వనరుగా ఉన్న సింగూర్, మంజీరా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి.దాదాపు 30 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సింగూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం కనీస స్థాయికి నీటి నిల్వలు పడిపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఈ ప్రాజెక్ట్ప్ మీద ఆధారపడిన సంగారెడ్డితో పాటు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ నగరానికి కూడా భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిస్థితుల తీవ్రతను గమనించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు, ప్రణాళికలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. రాబోయే కాలంలో నీటి వృథాను అరికట్టకపోతే తీవ్రమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Anupama Parameswaran: పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది! అనుపమ బోల్డ్ కామెంట్స్

Khushboo: ఐదు పదుల వయసులోనూ.. నటి ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

Published on: Oct 17, 2026 05:41 PM
Loading...
Unable to load recommendations.
Follow Us