ఆ ఊరిలో జంబలకడిపంబ.. పురుషులు, స్త్రీలుగా, స్త్రీలు పురుషులుగా మారి వీడియో

Updated on: Nov 30, 2025 | 1:50 PM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో వింత ఆచారం ఉంది. ఇక్కడ వివాహాలు చాలా విచిత్రంగా జరుగుతాయి. పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులగా మారి వివాహం చేసుకోవడం ఇక్కడి ఆచారం. వివాహం చేసుకోవడం వరకూ ఓకే.. మరి తర్వాత? వివాహానంతరం కూడా వారిరువురూ అలాగే కొనసాగుతారా? జంపలకిడి పంబేనా అనుకంటున్నారా? మీ అనుమానం కరెక్టే.. ఆఫ్టర్‌ మ్యారేజ్‌ వారి పరిస్థితేంటి అనేది ఇప్పుడు చూద్దాం..

పెళ్లిళ్లు అనగానే ఒక్కో కుటుంబానికి ఒక్కో పద్ధతి లేదా ఆచారం ఉంటుంది. దానిని ఫాలో అవుతూ పెద్దలు వివాహాలు జరిపిస్తారు. అలాగే యర్రగొండపాలెం లోని కొలుకుల గ్రామానికి చెందిన బత్తుల శివగంగురాజు కుటుంబానికీ ఓ ఆచారం ఉంది. వీరి వంశాచారం ప్రకారం పెళ్లికి ముందు వరుడు వధువుగా, వధువు వరుడుగా అలంకరించుకొని తమ ఇష్టదైవానికి పూజలు చేస్తారు. ఇలా వధూవరులు వేషధారణలు మార్చుకొని గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి తమ ఇష్టదైవానికి పూజలు చేయాలి. అనంతరం యధావిధిగా వధూవరులు తమ వేషాలు మార్చుకుంటారు. తర్వాత పెద్దలంతా కలిసి వధూవరులకు వివాహం జరిపిస్తారు. ఈ క్రమంలో బత్తుల శివ గంగురాజు, నందినిలకు వివాహం కుదిరింది… ఇద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి ముందు ఇష్టదైవాన్ని పూజించేందుకు వెళ్లారు. తమ కుటుంబాల్లో ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తోందని, ఇప్పటికీ వీటిని కొనసాగిస్తున్నామని బత్తుల వంశీయులు తెలిపారు. ఇలా చేయడం వల్ల తమ వంశానికి మంచి జరుగుతుందని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో

వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో

ఎదురు తిరిగిన సంజనా.. నాగ్‌ సీరియస్! హౌస్‌ డోర్స్‌ ఓపెన్ వీడియో