YS Sharmila: తనయుడి పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన వైఎస్ షర్మిల
క్లారిటీ వచ్చేసింది. తనయుడి పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు వైఎస్ షర్మిల. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి.. కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని ఆమె చెప్పేశారు. అంతకుముందు కర్నూలు పర్యటనకు బయలుదేరిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉండటంపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఏపీలో మరో వారసుడి పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ విషయంపై షర్మిల కూడా క్లారిటీ ఇచ్చేశారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని షర్మిల తెలిపారు.
అంతకుముందు కర్నూలు పర్యటనకు బయలుదేరిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉండటంపై ఆసక్తికర చర్చ జరిగింది. కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డికి విజయమ్మ ఆశీస్సులు అందించారు. దీంతో రాజారెడ్డి పొలిటికల్ ఇంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే అవసరమైనప్పుడు తన కుమారుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని షర్మిల కూడా తేల్చి చెప్పేశారు.