వంశీ అనూహ్య నిర్ణయం.. అభినందించిన జగన్

టీడీపీని వీడి వైసీపీతో కలిసి పనిచేయాలనుకుంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ కూడా మనస్పూర్తిగా అభినందించినట్లు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ వంశీ తీసుకున్న నిర్ణయం ఏంటి ? త్వరలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అయితే ఈ భేటీ […]

వంశీ అనూహ్య నిర్ణయం.. అభినందించిన జగన్
Follow us

|

Updated on: Nov 27, 2019 | 2:41 PM

టీడీపీని వీడి వైసీపీతో కలిసి పనిచేయాలనుకుంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ కూడా మనస్పూర్తిగా అభినందించినట్లు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ వంశీ తీసుకున్న నిర్ణయం ఏంటి ?

త్వరలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. అయితే ఈ భేటీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. దీనిపై పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు. అయితే ఈ కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో వంశీ రాజీనామా చేసి వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ మాత్రం రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని ఎప్పుడో తేల్చి చెప్పారు. రాజీనామా చేసే విషయంతోపాటు భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించడం కోసమే వంశీ జగన్‌ను కలిసినట్టు ప్రచారం జోరందుకుంది. అయితే వంశీ మాత్రం తన స్నేహితుడికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైల్ పనిపైనే జగన్‌ను కలిసినట్లు చెబుతున్నారు.

వైసీపీలో చేరినా, చేరకుండా అనుబంధంగా కొనసాగినా గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుతో ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగాలని వంశీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు తన రాజకీయ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. తన చేరికపై ముఖ్యమంత్రి ముందు ఓకే అని.. బయటికి వచ్చాక అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం ఇష్టం లేక వంశీ మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.

యార్లగడ్డ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఎన్నికల్లో డబ్బులు పోగొట్టుకున్నారని వంశీ కాస్తా సింపతీ చూపిస్తున్నారని, అందుకే సామరస్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని వంశీ అనుచరులు చెబుతున్నారు. ఇదే నిర్ణయాన్ని మంగళవారం ముఖ్యమంత్రిని కలిసినపుడు వంశీ చూచాయగా ఆయన చెవిన వేశారని తెలుస్తోంది. వంశీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అభినందించారని అంటున్నారు. మొత్తానికి చిన్నా చితకా గిల్లికజ్జాలు వద్దనుకున్న వంశీ నిర్ణయం మంచిదేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.