Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

Valentines Day : బ్రేకప్‌కి ఓ మెడిసిన్..!

Valentines DayBreak Up Therapy, Valentines Day : బ్రేకప్‌కి ఓ మెడిసిన్..!

Valentines Day : అయినవాళ్లు చనిపోయారు. లైఫ్‌ లాంగ్  మనతోనే ఉంటారనుకున్న అమ్మాయి లేదా అబ్బాయి..మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తారు. పక్కా మరో స్థాయికి తీసుకెళ్తందున్న ఎగ్జామ్‌లో ఊహించని విధంగా ఫెయిల్ అవుతాం. ఇలా ప్రతి వ్యక్తిని కొన్ని చేదు జ్ఞాపకాలు జీవితమంతా వెంటాడతాయి. అయితే సందర్బానుసారం గుర్తుకురావడం వేరు. పదే, పదే అవి మనసును గుచ్చడం వేరు. దీన్ని వైద్య పరిబాషలో పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్‌(పీటీఎస్‌డీ) అంటారు. దీనిపై కెనడాకు చెందిన బ్రూనెట్ అనే  ఓ సైకియాటిస్ట్ 15 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ వెంటాడే బాధలకు ఆయన ‘రీకన్సాలిడేషన్ థెరపీ’ కనిపెట్టారు. హై బీపీ, మెగ్రెయిన్ లాంటి సమస్యలకు చాలా కాలంగా ప్రొప్రనొలోల్ అనే ఔషధాన్ని రిఫర్ చేస్తున్నారు డాక్టర్లు. ఇది మరికొన్ని రుగ్మతలకు కూడా విరుగడుగా పనిచేస్తుందట. ‘రీకన్సాలిడేషన్ థెరపీ’లో భాగంగా ముందుగా రోగికి ప్రొప్రనొలోల్‌ను ఇస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని తనను వెంటాడే బాధలను పేపర్‌పై రాసి…గట్టిగా చదివి వినిపించమని చెప్తారు. దీని ద్వారా ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న మానసిక బాధ ఏంటనేది డాక్టర్లు గుర్తిస్తారు.

ఇలా చేయడం వల్ల రోగి కొంత స్వాంతన ఫీల్ అవుతాడు. ఈ థెరపీని ఫాలో అవ్వడం వల్ల ఆ చేదు జ్ఞాపకాలు మనసును వదిలి వెళ్లిపోవు కానీ..నిరంతరం వేధించకుండా ఉంటాయి. మనిషి భావోద్వేగాలు మెదడులోని అమిగ్దల అనే ఏరియాలో స్టోర్ అయి ఉంటాయి. ఆ భావోద్వేగాలు నిక్షిప్తమై ఉన్న భాగాన్ని ఐడెంటిఫై చేసేందుకు ప్రొప్రనొలోల్ యూజ్ అవుతుంది. ఈ ఔషధం ఇచ్చిన రోగులు..  తమ తీవ్రమైన భావోద్వేగపూరిత మెమరీని రీకాల్ చేసి, దాని తీవ్రతను తగ్గించుకోని మళ్లీ ‘సేవ్’ చేసుకుంటారు. ఇలా చెయ్యడం ద్వారా ఆ భావోద్వేగ తీవ్రత చాలావరకు తగ్గిపోతుంది. ఇలా డాక్టర్  బ్రూనెట్ చేసిన పరిశోధనలో 70 శాతం మంది రోగులు ఉపశమనం పొందారట. ఆయన ఇప్పటివరకు  ఫ్రాన్సులో 400 మందికి ఈ థెరపీని అందించారు. సర్‌ప్రైజింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే.. లవ్ ఫెయిల్యూర్ అయిన చాలామంది వ్యక్తులు కూడా కేవలం ఒక్కసారి ఈ థెరపీ చేయించుకోవడం ద్వారా ఆ వేదన నుంది ఉపశమనం పొందారని ఆయన చెప్తున్నారు.