బిజెపికి కాంగ్రెస్ డైరెక్షన్..హుజూర్ నగర్లో ఏం జరుగుతుందంటే..?

దేశవ్యాప్తంగా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. మారిన పరిణామాల కారణంగా ఎంపీగా గెలిచిన ఉత్తం కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యారు. అయితేనేం.. ఉత్తం కుమార్ తన ప్రాబల్యం చేజారీపోకుండా.. గతంలో కోదాడ నుంచి […]

బిజెపికి కాంగ్రెస్ డైరెక్షన్..హుజూర్ నగర్లో ఏం జరుగుతుందంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 8:17 PM

దేశవ్యాప్తంగా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. మారిన పరిణామాల కారణంగా ఎంపీగా గెలిచిన ఉత్తం కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యారు. అయితేనేం.. ఉత్తం కుమార్ తన ప్రాబల్యం చేజారీపోకుండా.. గతంలో కోదాడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తన సతీమణి పద్మావతిని ఇపుడు ఉప ఎన్నికల బరిలో నిలిపారు. ఇందుకోసం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆయన అమీతుమీకి కూడా సిద్దమయ్యారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంటును కాపాడుకోవడం ఉత్తం కుమార్ కు అత్యంత ప్రతిష్టాత్మకం అయ్యింది.

అయితే, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సంఖ్యాబలంలో పూర్తిగా పతనం చేసి, శాసనసభలో కనీసం రెండో స్థానానికి కూడా అనర్హతకు గురయ్యేలా చేసిన గులాబీ పార్టీ.. ఇపుడు హుజూర్ నగర్ ను సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కుని.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని చాటేందుకు ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ లో మోహరించిన గులాబీ దళం.. విజయం కోసం కావాల్సిన అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అధికార బలం లేని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు.

తమకు చిరకాల ప్రత్యర్థి అయిన బిజెపిని కూడా కాంగ్రెస్ నేతలు గైడ్ చేస్తుండడం హుజూర్ నగర్లో ఆశ్చర్యకరమైన పరిణామం. ముందుగా ఢిల్లీ వెళ్ళి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.. తర్వాత బిజెపి నేతలకు కావాల్సిన సరంజామా ఇచ్చి, ఈసీకి నివేదించాల్సిన అంశాలపై క్లియర్ కట్ ట్రైనింగ్ ఇచ్చి మరీ ఢిల్లీకి పంపడం విశేషం వినేందుకు విచిత్రంగా అనిపిస్తున్నా.. ఇది అక్షరాలా నిజం.

గురువారం ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ .. చీఫ్ కమిషనర్ ను కలిసేందకు నిర్వాచన్ సదన్ దగ్గర వెయిట్ చేస్తుండగా.. ఉత్తం కుమార్ రెడ్డి నుంచి కాల్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు మీడియా వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న లక్ష్మణ్ ఫోన్ రింగ్ కాగా.. ఆయన మోబైల్లో ఉత్తమ్ కుమార్ పేరు కనిపించిందని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాల్ మాట్లాడేందుకు లక్ష్మణ్ మీడియా సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళడం ఆశ్చర్యపరిచింది. కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఖచ్చితంగా వివరించాల్సిన అంశాలపై ఉత్తం కుమార్ రెడ్డి.. లక్ష్మణ్ కు బ్రీఫింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

చిరకాల రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఉమ్మడి శత్రువును ఓడించేందుకు రాజకీయ విభేదాలను సైతం పక్కన పెట్టడంతో అక్కడున్న మీడియా వర్గాలు ఆశ్చర్యానికి గురి కాగా.. కొందరు సీనియర్లు మాత్రం.. పొలిటికల్ గేమ్ లో ఇవన్నీ మామూలే అని నవ్వుకోవడం విశేషం.