యుఎస్.. డెట్రాయిట్ లో కాల్పులు.. ఒకరి మృతి

మినియాపొలిస్ లో ఓ పోలీసు అమానుషానికి జార్జ్ ఫ్లాడ్ అనే నల్లజాతీయుడు బలైన సంగతి తెలిసిందే. జార్జి మెడపై డెరెక్ అనే పోలీసు కాలు పెట్టి నొక్కడంతో అతడు ఊపిరాడక మరణించాడు...

యుఎస్.. డెట్రాయిట్ లో కాల్పులు.. ఒకరి మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 5:30 PM

మినియాపొలిస్ లో ఓ పోలీసు అమానుషానికి జార్జ్ ఫ్లాడ్ అనే నల్లజాతీయుడు బలైన సంగతి తెలిసిందే. జార్జి మెడపై డెరెక్ అనే పోలీసు కాలు పెట్టి నొక్కడంతో అతడు ఊపిరాడక మరణించాడు. జార్జి మృతికి నిరసనగా నిన్న మినియాపొలిస్ లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగి కొన్ని షాపులను డ్యామేజ్ చేయడమే కాక ఓ పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లు క్రమంగా డెట్రాయిట్ సిటీకి కూడా పాకాయి. శనివారం ఉదయం ఈ సిటీలో జరిగిన ఆందోళనలో నిరసనకారులపై ఓ అజ్ఞాత వ్యక్తి కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. ఎస్వీయూలో ప్రయాణిస్తున్న ఈ వ్యక్తి హఠాత్తుగా కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. కాగా… డెరెక్ ని థర్డ్ డిగ్రీ మర్డర్ ఆరోపణలతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.