మందుల కోసం రూ. 30 ఇవ్వమంటే.. తలాక్ చెప్పేశాడు!

UP Woman Allegedly Given Triple Talaq after She Asked Husband for Rs 30 to Buy Medicines

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ ఇటీవలే చట్టం చేసింది. అయినప్పటికీ దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట తలాక్ చెప్పి, విడాకులు ఇస్తున్న ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. జ్వరంతో బాధపడుతున్న కూతురుకి మందులు కొనడం కోసం రూ. 30 అడిగిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి, ఇంటి నుంచి గెంటెశాడో భర్త. ఈ ఘటన రెండు రోజుల కిందట ఉత్తర ప్రదేశ్‌ హపూర్‌లో  చోటు చేసుకుంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పిల్లలను తన నుంచి లాక్కుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. భర్త కుటుంబ సభ్యులు కూడా అతనికే వంత పాడారాని.. అంతా కలిసి ఇంటి నుంచి గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం..తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తారు. దీనికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *