ట్విట్టర్ సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఓ సంచలన ప్రకటనను జారీ చేసింది. ఇకపై తమ కంపెనీ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఇంటి దగ్గర నుంచే పని చేయవచ్చునని ప్రకటించింది. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల బాటలోని ట్విట్టర్.. తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించింది. ఒకవేళ కరోనా వ్యాప్తి కంట్రోల్ అయినా కూడా […]

ట్విట్టర్ సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 13, 2020 | 2:24 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఓ సంచలన ప్రకటనను జారీ చేసింది. ఇకపై తమ కంపెనీ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఇంటి దగ్గర నుంచే పని చేయవచ్చునని ప్రకటించింది.

ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల బాటలోని ట్విట్టర్.. తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించింది. ఒకవేళ కరోనా వ్యాప్తి కంట్రోల్ అయినా కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వర్క్ చేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని సంస్థ పేర్కొంది. ప్రస్థుత కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు.. మరిన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించాలని కోరడంతో.. దాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా, సెప్టెంబర్ వరకు తమ కార్యాలయాలను తెరిచేది లేదని ట్విట్టర్ స్పష్టం చేసింది.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!