Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

నేను అన్నది కరెక్టే.. కానీ.. రవిశంకర్ ప్రసాద్

మూడు బాలీవుడ్ చిత్రాలు ఒకే రోజు రూ. 120 కోట్ల బాక్సాఫీసు వసూళ్లు సాధించాయని, దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అర్థమవుతోందని తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. తన కామెంట్ ని .. మీడియా సందర్భోచితం కాని రీతిలో వాడుకుందని ఆయన ఆదివారం పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.ఈ నెల 2 న విడుదలైన 3 బాలీవుడ్ సినిమాలు ఒకేరోజు రూ. 120 కోట్లు సాధించాయని అన్నారు. వాస్తవానికి అది సరైన స్టేట్ మెంటే అని, భారత చలన చిత్ర రాజధాని అయిన ముంబైలో ఉన్నాను గనుక అలా అన్నానని రవిశంకర్ ప్రసాద్ అంగీకరించారు. నా ట్విట్టర్లో నేను మీడియాతో ఇంటరాక్ట్ అయిన మొత్తం వ్యవహారం ఎవరికైనా అందుబాటులో ఉంది.. కానీ నేను చేసిన వ్యాఖ్యల్లో ఓ భాగాన్ని పూర్తిగా ట్విస్ట్ చేశారు అని ఆయన ఒకవిధంగా మీడియామీద ‘ నెపం ‘ నెట్టారు. ఏదిఏమైనా.. తనది సున్నిత (సెన్సిటివ్) హృదయం గనుక ఆ కామెంట్స్ ని ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమ మనకు ఉండడం ఎంతో గర్వకారణమని, పన్నుల చెల్లింపుల ద్వారా ఈ పరిశ్రమ దేశానికి చాలా సేవ చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అటు-ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను కోమల్ నహతా అనే వ్యక్తి రిలీజ్ చేశారు. ‘ అక్టోబర్ 2 జాతీయ సెలవు దినమని, ఆ రోజున విడుదలైన ‘ జోకర్ ‘, ‘ వార్ ‘, ‘ సైరా ‘ చిత్రాలు రూ. 120 కోట్ల వసూళ్లు సాధించాయని ఇందుకు కారణం దేశ ఆర్ధిక పరిస్థితి బాగా ఉండడమేనని ‘ ఆయన వ్యాఖ్యానించినట్టు ఇందులో స్పష్టంగా ఉంది. అయితే రవిశంకర్ ప్రసాద్ మాటలపై అప్పుడే విమర్శల జోరు పెరిగింది. చైనాకు సంబంధించి ఆ దేశ ఆర్ధిక పరిస్థితిని గమనించండి అని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ అన్నారు. ‘ ఆ దేశ ప్రధాని లీ కిజియాంగ్.. ‘ ఇండికేటర్లతో ‘ ఏకంగా తమ దేశ ఎకానమీని అంచనా వేసేందుకు తన పేరిట ఓ ఇండెక్స్ నే ఇన్స్ పైర్ చేయగలిగారు.. రైలు రవాణా, విద్యుత్ వినియోగం, బ్యాంక్ క్రెడిట్ వంటివాటిని ‘ ఉత్తేజపూరితం చేసారాయన అని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆ వ్యవస్థతో పోలిస్తే.. మన ఐటీ మంత్రిగారి డైలీ ఫిల్మ్ ట్రేడ్ చాలా బెటర్..నిజానికి ఇది ప్ర-సాద్ ఇండెక్స్ ‘ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దేశ ఆర్ధిక వృద్ది రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఈ ఏడాది ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా, బ్రెజిల్ దేశాల్లో ఎకానమీ స్థితి దారుణంగా ఉందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివా ఇటీవలే ప్రకటించిన విషయం గమనార్హం.

Related Tags