కరోనా రోగిని తిప్పి పంపిన ఢిల్లీ ఆస్పత్రులు.. చివరికి…

కరోనా వైరస్ కి గురైన రోగిని చేర్చుకునేందుకు కాదు కదా కనీసం కరోనా టెస్టు చేయడానికైనా ఢిల్లీలోని ఐదు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ 42 ఏళ్ళ ఆ రోగి.. ఢిల్లీకి సుమారు 800 కి.మీ. దూరంలోని..

కరోనా రోగిని తిప్పి పంపిన ఢిల్లీ ఆస్పత్రులు.. చివరికి...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 7:37 PM

కరోనా వైరస్ కి గురైన రోగిని చేర్చుకునేందుకు కాదు కదా కనీసం కరోనా టెస్టు చేయడానికైనా ఢిల్లీలోని ఐదు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ 42 ఏళ్ళ ఆ రోగి.. ఢిల్లీకి సుమారు 800 కి.మీ. దూరంలోని భోపాల్ కి చికిత్స కోసం వెళ్ళాడు. అయితే ఆ నగరం చేరగానే మరణించాడు. ఢిల్లీలో ఉన్న ఆయన భార్య తన భర్త మృతి సమాచారం తెలుసుకుని ఆస్తమా ఎటాక్ కి గురైంది. దీంతో తన తల్లిని 15 ఏళ్ళ ఆమె కుమార్తె లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో నోయిడాలోని ఓ ఆసుపత్రికి ఆమె తన తల్లిని తీసుకువెళ్ళింది. ఈ బాలిక 19 ఏళ్ళ సోదరుడు భోపాల్ లో చదువుతున్నాడని, అతని తండ్రి కరోనాతో మరణించడంతో .. ఆ కుర్రాడ్ని అక్కడి ఓ ఆసుపత్రిలో క్వారంటైన్ కి తరలించారని తెలిసింది. ఇప్పుడు అతని 15 ఏళ్ళ చెల్లెలు నోయిడాలోని ఆసుపత్రిలో తల్లి వద్ద ఒంటరిగా దిక్కులేనిదానిలా ఉంది. ఓ వైపు తండ్రి చనిపోయాడు. మరో వైపు తల్లి ఆసుపత్రి పాలయింది. కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా తిప్పి పంపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్ఛరించినప్పటికీ ఈ నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడంలేదని ఈ ఘటనే నిరూపిస్తోంది. అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేజ్రీ వాల్ సర్కార్ ని దుయ్యబట్టింది.