ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో

ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2020 | 9:04 AM

Srivari Brahmotsavam 2020: ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆగమసలహాదారులు, అర్చకులతో చర్చించి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు విధివిధానాలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమజనం నిర్వహించామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే ఆలయ శుద్ధి చేపట్టామని వివరించారు.

శ్రీవారి ఆలయంలో దర్శనాలకు, వాహనసేవలకు సంబంధం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నామని, భక్తులందరూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎస్వీబీసీ ద్వారా వీక్షించాలని ఆయన కోరారు. ఇక గరుడసేవ సందర్భంగా ఈనెల 23న సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. కరోనా కారణంగా రద్దు చేసిన పద్మావతి పరిణాయోత్సవాల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

Read More:

శర్వాకు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ..!

మంత్రి అవంతి శ్రీనివాస్‌కి కరోనా పాజిటివ్‌