పాక్ విన్నపాలనూ వింటాడా ? 23న పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీ

Trump to meet Imran Khan, పాక్ విన్నపాలనూ వింటాడా ? 23న పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ఈ నెల 23 న భేటీ కానున్నారు. 22 (ఆదివారం) ప్రధాని మోదీ గౌరవార్థం హౌదీమోదీ పేరిట టెక్సాస్ లోని హూస్టన్ లో జరగనున్న మెగా ఈవెంట్ లో ఒకే వేదికను పంచుకోనున్న ఆయన.. ఆ మరుసటిరోజు ఇమ్రాన్ తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇమ్రాన్ తో ట్రంప్ సమావేశం అవుతాడన్న విషయం బయటికి పొక్కలేదు. అయితే శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘ కఠిన ‘ విధానాన్ని ఇమ్రాన్ ఆ సందర్భంగా ట్రంప్ కు విన్నవించవచ్చు.. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభన ను పరిష్కరించేందుకు అనువుగా జోక్యం చేసుకోవాలని కోరవచ్ఛు. (అయితే మూడో దేశ జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వం గా తోసిపుచ్ఛుతోంది).జోక్యానికి తాను రెడీ అని ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించారు. అటు-హౌదీమోదీ ఈవెంట్ అనంతరం ట్రంప్ మళ్ళీ మంగళవారం న్యూయార్క్ లో మోదీతో సమావేశమవుతారు.
ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 74 వ సెషన్ ను పురస్కరించుకుని.. న్యూయార్క్ లోనే భారత, పాక్ ప్రధానులను ఆయన కలుసుకుంటారు. ఐరాస సభలో మోదీ, ఇమ్రాన్ ప్రసంగించనున్న విషయం తెలిసిందే. కాగా.. డోనాల్డ్ ట్రంప్ వీరిద్దరినీ కలుసుకుని మాటామంతీ కలిపిన అనంతరం ఓహియో పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *