విగ్రహాలను, స్మారకాలను నాశనం చేస్తే ఖబడ్డార్ ! ట్రంప్ హెచ్ఛరిక

ఆందోళనకారుల నుంచి దేశంలోని  విగ్రహాలను, స్మారకాలను పరిరక్షించేందుకు తను కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం 'కఠిన ఉత్తర్వులపై' సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ స్మారకాలు..

విగ్రహాలను, స్మారకాలను నాశనం చేస్తే ఖబడ్డార్ ! ట్రంప్ హెచ్ఛరిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2020 | 4:31 PM

ఆందోళనకారుల నుంచి దేశంలోని  విగ్రహాలను, స్మారకాలను పరిరక్షించేందుకు తను కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం ‘కఠిన ఉత్తర్వులపై’ సంతకం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ స్మారకాలు, విగ్రహాలను కాపాడుకోవలసిందే.. అందువల్ల క్రిమినల్ వయొలెన్స్ నుంచి వీటిని పరిరక్షిస్తాం అన్నారాయన. చట్టాన్ని అతిక్రమించే ఆందోళనకారులకు సుదీర్ఘ జైలు శిక్షలు తప్పవన్నారు. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో మాజీ అధ్యక్షుడు ఏండ్రు జాక్సన్ విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడానికి యత్నించారు. ఆ విగ్రహాన్ని తాళ్లు, చైన్లతో కట్టి దాన్ని కిందికి పడగొట్టేందుకు ప్రయత్నించారు. గత మే 25 న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం రేసిజానికి, పోలీసుల అమానుషత్వానికి నిరసనగా అనేకమంది ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విధమైన హింసాత్మక చర్యలను తాను సహించబోనని ట్రంప్  వార్నింగ్ ఇచ్చారు.  ప్రస్తుత చట్టాన్ని తన ఉత్తర్వులు మరింత బలోపేతం చేస్తాయన్నారు.

2003 లో ఆమోదించిన ‘వెటరన్స్’ మెమోరియల్ ప్రిజర్వేషన్ యాక్ట్’.. ఇలా దేశంలో స్మారకాలు, విగ్రహాలను ఎవరు ధ్వంసం చేసినా వారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తోంది. ఈ చట్టం కింద వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అటార్నీ జనరల్ కి విశేష అధికారాలు ఉంటాయి. ఫెడరల్ ఆస్తిని నాశనం చేయడానికి యత్నించిన నిరసనకారులను వెంటనే అరెస్టు చేయాలని  ట్రంప్.. అధికారులను ఆదేశించారు.

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..