Breaking News
  • పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు. నదిలోకి దూకి యువతిని కాపాడిన ఏఎస్సై మాణిక్యాలరావు. మాణిక్యాలరావును అభినందించిన పోలీసులు, స్థానికులు.
  • చెన్నై: సినీ నటుడు రాఘవ లారెన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజినీ రాజకీయాలకు వస్తున్నారని.. కొందరు మాట్లాడటం దురదృష్టకరం-రాఘవ లారెన్స్‌. రజినీకి రాజకీయాలు తెలియదు అనడం హాస్యాస్పదం. రజినీని ఎవరు టార్గెట్‌ చేసినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్తా. త్వరలో రజినీ రాజకీయం ఏంటో అందరూ చూస్తారు-రాఘవ లారెన్స్‌. రజినీ మీద అభిమానంతో కమలహాసన్‌ పోస్టర్లను పేడతో కొట్టి చించేవాణ్ణి. వాళ్లిద్దరు కలవడం ద్వారా తమిళనాడులో మంచి రోజులు రాబోతున్నాయి -సినీ నటుడు రాఘవ లారెన్స్‌.
  • కరీంనగర్‌: కోరుట్లలో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన. ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌. వైద్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజలు భయపడేవారు. కేంద్ర పథకం ఆయుష్మాన్‌ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మిన్న.
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ

TRS plans to fight for demands during Parliament Winter session, కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై అయా పార్టీలు పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతులపై ఈ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు.

హామీలపై నిలదీయండి..

విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, పెండింగ్ అంశాలను సభలో లేవనెత్తాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటివరకు అనేకమార్లు ప్రధానమంత్రి సహా అనేకమంది కేంద్రమంత్రులు, అధికారులకు పలు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చామని, అవి ఇంకా కార్యరూపం దాల్చడంలేదన్నారు. ఈ అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏర్పాటు చేయాల్సిన.. బయ్యారం ఉక్కు కర్మాగారం, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, ఐఐఎం లాంటి విద్యాసంస్థల ఏర్పాటు తదితర విజ్ఞప్తులను ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రుల ద్వారా, పార్లమెంట్‌లో ఫాలోఅప్ చేయాలని ఎంపీలకు కేటీఆర్ సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల బదలాయింపు వంటి తక్షణ అవసరమైన అంశాలపై ఎంపీలు పనిచేయాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెపై బీజేపీ ప్రస్తావిస్తే..

అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తులకు.. కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ అంశాలన్నీ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటిని ఎంపీలు ఫాలోఅప్ చేయాలన్నారు. పార్లమెంట్‌లో అంశాలవారీగా టీఆర్‌ఎస్ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు కేటీఆర్. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె అంశంపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు ప్రస్తావిస్తే.. సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎంపీలకు కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల విషయంలో బీజేపీ వైఖరి, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీల పరిస్థితిపై ప్రస్తావించాలన్నారు. ఇక ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మోటర్ వెహికిల్ చట్టం గురించి కూడా మాట్లాడాలన్నారు.