Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ట్రైబల్‌ వర్సిటీ నిర్మాణంపై నీలి నీడలు..

tribal university praposal stalled is Vizianagaram

రోజుకో ఊరు .. పూటకో ప్రాంతంలా తయారైంది విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోయే సెంట్రల్ గిరిజన యూనివర్శిటి పరిస్థితి. ఏపి విభజన సమయంలో గిరిజనులు ఎక్కువగా ఉండే ఆంద్రాలో ట్రైబల్ యూనివర్శిని ఏర్పాటు చేస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది. తరువాత వచ్చిన బీజేపీ సర్కార్ సైతం ట్రైబల్ యూనివర్శిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని అత్యధికంగా గిరిజనులుండే విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది… కేంద్ర మానవ వనరుల శాఖ సైతం విజయనగరంలో అనేక ప్రాంతాలను పరిశీలించి చివరకు కొత్తవలస ప్రాంతంలో రెల్లి అనే గ్రామంలో గల సుమారు 526 ఎకరాల భూమిని గుర్తించారు. అక్కడే ట్రైబల్ యూనివర్శిటికి అనువైన ప్రదేశమని ఆ భూమిని అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కేంద్ర సర్కార్..  అడిగిందే తడువుగా అక్కడ నివసించేవారికి సైతం ప్రత్యామ్నాయం కల్పించి ప్రతిపాదిత భూమిని అప్పగించారు అధికారులు..

అయితే ఇంత వరకు బాగానే ఉంది..కానీ, ఆ తరువాత గిరిజన వర్సిటీ నిర్మాణం పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు..పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన స్థానికులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున జిల్లాలో ఉద్యమాలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత  మేర నిధులు కేటాయించింది. ముందుగా కేటాయించి యూనివర్శిటి స్థలంలో ప్రహారి గోడ కోసం నాటి మంత్రులతో శంఖుస్థాపనలు చేసి పనులు ప్రారంభించింది అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం. శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా,.. సాంకేతిక ఇబ్బందులను సాకుగా చూపిస్తూ కేంద్రం మాత్రం యూనివర్సిటి ఏర్పాటును  దాటవేస్తూ వచ్చిందనే ఆరోపణలున్నాయి… గతంలో పార్లమెంట్ లో ఎంపి లు ట్రైబల్ యూనివర్శిటిని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేయటంతో దిగోచ్చిన కేంద్ర ప్రభుత్వం 2019 నుండి తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించింది కేంద్రం.

కేంద్రం ప్రకటించిన విధంగానే విద్యార్దుల అర్హత పరీక్షను నిర్వహించే బాధ్యతను ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటికీ, క్లాసుల నిర్వహణ బాధ్యతను తాత్కాలికంగా ఆంధ్రా యూనివర్శిటికి అప్పగించింది కేంద్ర మానవ వనరుల శాఖ. దీంతో విజయనగరం జిల్లా నరవ సమీపంలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లో తాత్కాలికంగా  క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకున్న అధికారులు, జాతీయ స్థాయి కౌన్సిలింగ్‌లో ట్రైబల్ యూనివర్శిటిలో సీట్లు కేటాయించారు. అయితే ఆ భవనం సరిగా లేదంటూ ఏయూ విసి తరగతులను విజయనగరం ఆంధ్రా యూనివర్శిటి ఏక్సేటేన్షన్ సెంటర్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసి రెల్లి గ్రామంలో నిర్మాణాలు కొనసాగించాలని భావించారు…

అయితే, తాజాగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటి కథ మళ్లీ మొదటికి వచ్చింది. యూనివర్శిటితో గిరిజనులకి ఉపయోగంలేదని పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా మారిస్తే,  ట్రైబల్ యూనివర్శిటి …ఇటు విజయనగరరానికి, అటు కొత్తగా ఏర్పడే  అరకు జిల్లాకు కాకుండా పోయి విశాఖకి చెందుతుందని, పార్వతీపురం డివిజన్ పరిధిలోని ఎజెన్సీలో ఏర్పాటు చేస్తే జిల్లా విభజన చేసిన గిరిజన ప్రాంతంలో ఉంటుందని గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించటంతో..సీఎం జగన్‌.. ట్రైబల్‌ యూనివర్సిటీని మార్చాలంటూ ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని కోరినట్లుగా సమాచారం. అంతే కాకుండా సాలురు నియోజకవర్గంలోని పాచిపేంట మండలం పెద్ద కంచేరులో నాలుగు వందల ఎకరాల భూమిని వర్సిటీ కోసం అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ చేతులు మీదుగా మరో సారి గిరిజన యూనివర్శిటికి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లాలోని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్సిటి నిర్మాణం పై స్థానికుల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి.