Breaking News
  • చెన్నై: ఇండియన్‌-2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం. షూటింగ్‌ జరుగుతుండగా ఒక్కసారిగా పడిపోయిన భారీ క్రేన్‌. అక్కడికక్కడే ముగ్గురు మృతి. మరో 10 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. పూనమల్లి దగ్గర జరుగుతున్న సినిమా షూటింగ్‌. ఇండియన్‌-2 సినిమాకు శంకర్‌ దర్శకత్వం. ఇండియన్‌-2 సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్‌. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు. ప్రమాద వివరాలను పోలీసులకు తెలిపిన కమల్‌హాసన్‌.
  • షూటింగ్‌ ప్రమాదంపై నటుడు కమల్‌హాసన్‌ ట్వీట్‌. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం అత్యంత భయంకరమైనది. నేను ముగ్గురు స్నేహితులను కోల్పోయాను. నా బాధ కన్నా చనిపోయిన వారి కుటుంబసభ్యుల దుఃఖం చాలా ఎక్కువ. నేను వారిలో ఒకరిగా వారి కష్టాల్లో పాల్గొంటాను. మృతులకు నా ప్రగాఢ సానుభూతి-ట్విట్టర్‌లో కమల్‌హాసన్‌.
  • ఇండియన్‌-2 సినిమా షూటింగ్‌ ప్రమాదంపై లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటన. షూటింగ్‌ స్పాట్‌లో దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదంలో ఎంతో ముఖ్యమైన ఉద్యోగులు మృతిచెందారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, ఆర్ట్‌ అసిస్టెంట్‌ చంద్రన్‌.. ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మధు మృతిచెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి-లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ.
  • మహారాష్ట్ర: చంద్రాపూర్‌ జిల్లా ముల్‌లో ఘోర ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి. మరో ఆరుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • కర్నూలు: నేటి నుంచి యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఐదు రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు.
  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు. ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన కంటైనర్‌, 10 మంది మృతి. మరో 26 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. తిరుపూర్‌ జిల్లా అవినాశిలో ఘటన. సేలం జిల్లా ఓమలూరులో కారు-బస్సు ఢీ. ఐదుగురు నేపాల్‌ వాసులు మృతి.

గిరిజనులకు చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి పుష్పా శ్రీవాణి

Pushpa SriVani Comments, గిరిజనులకు  చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి పుష్పా శ్రీవాణి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పుష్పా శ్రీవాణి విమర్శలు చేసారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజనులను అంటరానివారిగా చూశారని ఆరోపించారు.  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన గ్రామాల ఆరోగ్య కార్యకర్తల వేతనాన్ని రూ.4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గత ప్రభుత్వంలో గిరిజనులకు ఎలాంటి పదవులు దక్కలేదని, తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గిరిజన ఆడ పిల్లలకు వైఎస్సార్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రథమ స్ధానంలో వచ్చేలా చేస్తామన్నారు మంత్రి శ్రీవాణి.

Related Tags