Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..

New Hairstyle: నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. అయితే అలా అనుకునే అందరిలో కొందరు మాత్రమే అందుకు కావలసిన ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. చూడడానికి గేదె కొమ్ముల్లాంటి..

Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
Weird Hairstyle

Updated on: Jun 25, 2023 | 8:43 PM

New Hairstyle: నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. అయితే అలా అనుకునే అందరిలో కొందరు మాత్రమే అందుకు కావలసిన ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. చూడడానికి గేదె కొమ్ముల్లాంటి హెయిర్ స్టెయిల్ చేయించుకున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో అది. అందులో మీరు సదరు మహిళ సెలూన్‌లో ఉండడం, అలాగే బార్బర్‌తో హెయిర్ స్ప్రే చేయించుకోవడాన్ని మీరు చూడవచ్చు. ఇక దాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అది నిజమైన గేదె కొమ్ముల్లా ఉన్నాయని, చైనీస్ మాత్రమే అలాంటి హెయిర్ స్టెయిల్ చేయంచుకోగలరని, ఆఫ్రికాలోని తెల్ల గేదె అని, యముడికి సవతి సోదరిలా ఉందని, ఇంటర్నెట్‌లో ఇలాంటి దారుణాలు ఇంకెన్నీ చూడాలో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 93 వేల లైకులు, 93 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..