Viral: ఫేక్ అకౌంట్‌తో భర్తకు ఫ్రెండ్ రిక్వెస్ట్.. అతడి చాటింగ్‌కు భార్య ఫ్యూజులౌట్!

కొందరు తమ ఫాంటసీల కోసం సరదాగా ఇలాంటి అకౌంట్‌లు ఉపయోగిస్తే.. మరికొందరు ట్రాప్ చేసేందుకు వినియోగిస్తారు.

Viral: ఫేక్ అకౌంట్‌తో భర్తకు ఫ్రెండ్ రిక్వెస్ట్.. అతడి చాటింగ్‌కు భార్య ఫ్యూజులౌట్!
Facebook

Updated on: Dec 01, 2022 | 8:22 PM

ఫేస్‌బుక్‌లో ఒరిజినల్ అకౌంట్ల కంటే.. నకిలీ ఖాతాలే ఎక్కువ ఉంటాయి. కొందరు తమ ఫాంటసీల కోసం సరదాగా ఇలాంటి అకౌంట్‌లు ఉపయోగిస్తే.. మరికొందరు ట్రాప్ చేసేందుకు వినియోగిస్తారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. దాని నుంచి తన భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇక అతడు చేసిన చాటింగ్‌ దెబ్బకు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ అసలేం జరిగింది.. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండోర్‌కు చెందిన ఓ మహిళ వయసులో తనకంటే పదేళ్ల పెద్దవాడైన వ్యక్తిని ఇష్టం లేకుండానే వివాహమాడింది. గవర్నమెంట్ జాబ్, ఎక్కువ ఆస్తి ఉన్నవాడు కావడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు అతడికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత ఆమె జీవితం దారుణంగా తయారయ్యింది. ఆమెను ఎప్పుడూ భర్త కొట్టడం, హింసించడం చేసేవాడు. కొన్నేళ్లు భరించింది.. చివరికి మూడేళ్ల కిందట అతడి నుంచి విడాకులు తీసుకుంది. తన భర్తపై వేధింపుల కేసు పెట్టింది.

మరోవైపు అతడిపై కేసు పెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆమె ఒక ఫేక్ అకౌంట్‌ను ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఆ రిక్వెస్ట్‌ను అతడు యాక్సెప్ట్ చేశాడు. ఆమెతో చాటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఆమె మెసేజ్‌లకు హద్దుమీరి అసభ్యకరంగా రిప్లయ్‌ ఇవ్వడమే కాకుండా.. మాటల్లో అతడి అసలు వయస్సు కూడా చెప్పేశాడు. అతడు తనకంటే 15 ఏళ్లు వయస్సులో పెద్దవాడని తెలిసి ఆమె షాక్ అయింది. అతడితో చేసిన చాటింగ్‌ను స్క్రీన్ షాట్లు తీసి.. అతడి బాగోతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. వీటిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us