
Trending: గోవాలోని ఒక బీచ్‌కు కొట్టుకొచ్చిన తిమింగలాన్ని ఆదివారం రక్షించి, స్వచ్ఛంద సేవకులు దానిని సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు. మధ్యాహ్నం గోవాలోని మాండ్రేమ్ బీచ్‌లో ఒక సముద్ర క్షీరదం కనిపించింది. దానిని గుర్తించిన వెంటనే, జల రక్షణ సేవల సంస్థ అయిన దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్‌కు చెందిన వాలంటీర్లు దానిని రక్షించేందుకు తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలలో వాలంటీర్ల బృందం చిన్నగా ఉన్న తిమింగలాన్ని పెద్ద గుడ్డ ముక్కలలో చుట్టి, సముద్రానికి దగ్గరగా లాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని సురక్షితంగా ఉంచడాని దానిపై నీళ్లు చల్లుతూ సముద్రంలోకి విడిచిపెట్టారు.
ఈ సహాయక చర్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తిమింగలాన్ని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమను వీడియోలో చూడవచ్చు. సముద్ర జీవులను రక్షించడంలో శిక్షణ పొందిన దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.
కొన్ని నెలల క్రితం ముంబైలోని బాంద్రా తీరంలో సుమారు 26 అడుగుల పొడవున్న హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దానిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో గోవాలో తిమింగలాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపించడం ఊరటనిచ్చే విషయంగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి