
పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు.. 10 మందికి ఉపయోగపడే పనిచేస్తే ఫేమ్ అనేది వద్దన్నా వస్తుందని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు నిరూపించాడు. విద్యార్థి అయిన 20 ఏళ్ల బిట్టు స్థానికంగా ఉన్న ఓ నదిని చూసి చలించి పోయాడు. ఎలాగైనా దాన్ని పూర్తిగా క్లీన్ చేయాలని సంకల్పించాడు. అయితే తనతో యంత్రాలు కొనే స్తోమత లేక పోవడంతో నేరుగా చేతులతోనే చెత్తను తీయడం స్టార్ట్ చేశాడు. దాదాపు మూడు నెలల పాటు కష్టపడి ఆ చెత్తను మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు పూర్తి చెత్త రహిత నదిగా దాన్ని తీర్చి దిద్దాడు.
అయితే బిట్టు ఈ నదిని క్లీన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు.. అతను సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమే ఈ పనులు చేస్తున్నారని, కొందరు అతనికి పిచ్చి పట్టిందని ఎగతాలి చేసినా బిట్టూ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోలేదు. తన పనిని తాపు చేస్తూ వెళ్లాడు. అంతే కాదు తనతో పాటు పది మందిలో స్పూర్తిని నింపాలనే ఉద్దేశంతో తాను చేసే పనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రముఖ వ్యాపార వేత్త అయిన ఆనంద్ మహింద్ర సైతం అతని వీడియో షేర్ చేస్తూ సపోర్ట్ చేయాలని కోరారు.
సోషల్ మీడియాలో బిట్టూ వీడియోలను చూసిన జనాలు సైతం అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. మనం ప్రకృతిని కాపాడుతే.. అది మనల్ని కాపాడుతుందని నిరూపించాడని కొందరు అతనిపై ప్రసంశల జల్లు కురిపించారు. అలాగే స్థానిక ప్రజల తీరుపై సైతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్లే ఇలా నదులు ఆశుభ్రంగా మారుతున్నాయని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహించాలని అన్నారు.
పోస్ట్ ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.