Viral Video: ఎరక్కపోయి ఇరుక్కున్న పాము.. ఈ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ఎలా రక్షించిందో చూడండి..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి, కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం మన గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో కూడా ఆ కోవకే చెందుతుంది. ఒక ఇరుకైన షెడ్డు కింద ఇరుక్కున్న భారీ నాగుపామును ఓ అమ్మాయి అత్యంత చాకచక్యంగా రక్షించింది.

Viral Video: ఎరక్కపోయి ఇరుక్కున్న పాము.. ఈ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ఎలా రక్షించిందో చూడండి..
Woman Snake Catcher Rescues Cobra

Updated on: May 30, 2026 | 12:56 PM

సాధారణంగా పాము కనిపిస్తేనే చాలా మంది ఆమడ దూరం పరుగెత్తుతారు. అలాంటిది సాక్షాత్తూ కోరలు చాచిన కాలనాగు ఎదురుపడితే భయంతో కాళ్లు వణికిపోవడం ఖాయం. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా యముడిలాంటి నాగుపాముతోనే ఆటలాడింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ భారీ సర్పాన్ని అత్యంత సురక్షితంగా పట్టుకుని, అడవిలో వదిలేందుకు సాహసం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

గడ్డపారతో మొదలైన ఆపరేషన్ స్నేక్ రెస్క్యూ

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ఇంటి ఆవరణలో ఉన్న పార్కింగ్ షెడ్ కింద భారీ నాగుపాము దూరింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మహిళా సర్పమిత్ర నీతా గజారే తన టీంతో కలిసి రంగంలోకి దిగారు. పాము దాక్కున్న సిమెంట్ గట్టును ఒక గడ్డపార సహాయంతో నెమ్మదిగా పగలగొట్టడం ప్రారంభించారు. గడ్డపార దెబ్బకు సిమెంట్ ముక్కలు విరిగిపోతుండటంతో లోపల దాక్కున్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి బుసలు కొట్టడం మొదలుపెట్టింది.

క్షణాల్లో ముగిసిన ఉత్కంఠ.. ఒట్టి చేతులతోనే

పాము బయటకు రాగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడ్డారు. కానీ నీతా గజారే మాత్రం ఏమాత్రం బెదరలేదు. పాము తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆమె తన అనుభవంతో ఎంతో కూల్‌గా వ్యవహరించారు. మొదట గడ్డపార సాయంతో పామును అదుపులోకి తెచ్చుకుని, ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఒట్టి చేతులతోనే దాని తోకను పట్టుకున్నారు. క్షణాల వ్యవధిలోనే ఆ భారీ పామును లొంగదీసుకుని, సురక్షితంగా రక్షించారు. ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన సూపర్ ఉమెన్ అంటే ఇదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us