Shocking Video: నది మధ్యలోని తేలుతున్న శరీరం.. తీరా దగ్గరికెళితే.. ఊహించని షాక్..!

Shocking Video: సోషల్‌ మీడియా.. ఇప్పుడు చాలా మంది తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు వీలైన ఓ వేదిక. అందుకే చాలా మంది నెటిజన్లు తమ గుర్తింపు కోసం..

Shocking Video: నది మధ్యలోని తేలుతున్న శరీరం.. తీరా దగ్గరికెళితే.. ఊహించని షాక్..!
Viral Pic

Updated on: Aug 25, 2021 | 9:07 PM

Shocking Video: సోషల్‌ మీడియా.. ఇప్పుడు చాలా మంది తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు వీలైన ఓ వేదిక. అందుకే చాలా మంది నెటిజన్లు తమ గుర్తింపు కోసం.. ఎన్నో వెరైటీ స్టంట్స్‌ చేస్తుంటారు. కొంత మంది అసలు ఎలాంటి పనులు చేస్తారు అంటే.. అవి చూసిన వారంతా ఆశ్చర్య పోవడం ఖాయం. తాజాగా ఓ వ్యక్తి చేసిన విచిత్ర పనికి.. నెటిజన్లే కాదు.. పోలీసులు సైతం బిత్తరపోయారు. ఇంతకీ అతడు ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం..

అది అమెరికాలోని అర్కనసాస్‌ నది. సమయం మధ్యాహ్నం 12 దాటింది. నది మధ్యలో ఓ వ్యక్తి శరీరం ఎటూ కదలకుండా కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఏంటా అని చూస్తున్నారు. ఏమైనా ప్రమాదం జరిగిందా? లేక ఇంకేదైనా జరిగిందా? అని ఆలోచించారు. చుట్టూ పక్కల వారంతా అతడు చనిపోయాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఆ నది దగ్గరకు వచ్చారు. దూరం నుంచి చూసిన పోలీసులు తొలుత ఆ శరీరాన్ని డెడ్ బాడీ అనుకున్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాడీ వద్దకు వెళ్లి చూశారు. అప్పుడే తెలిసింది అతడు బ్రతికే ఉన్నాడు అని. పోలీసులు సమీపించగానే.. ఆ వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాక్ అయ్యారు.

ఇలా ఎందుకు చేశామని అధికారులు అతడిని ప్రశ్నించగా.. నది మధ్యలో బాగుంది కదా అని చిన్న కునుకు తీస్తున్నా అని మెల్లగా చెప్పాడట. దీంతో అక్కడి నుంచి అధికారులు వెనక్కి వచ్చేశారు. పనిలోపనిగా అతనని కూడా వెనక్కి తెచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, దీనిపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిచ్చి సాహసాలు ఎవరూ చేయకండని వార్నింగ్ ఇచ్చారు. నీటి దగ్గర ఇలాంటి సాహసాలు చేస్తే చాలా ప్రమాదమని, అందుకే ఎవరూ ఇలాంటి సాహసాలు చెయ్యొద్దని హితవుచెప్పారు.

Viral Video:

Also read:

Viral Video: మీరేనా నేనూ ధరిస్తా మాస్క్.. ఈ వానరం ఏశాలు మామూలుగా లేవండోయ్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు ‘తలా’ రెడీ.. నెట్స్‌ బాదుడే బాదుడు..

Rahul Murder: రాహుల్ హత్య కేసు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడించిన కోగంటి సత్యం..