మనిషికి ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం తల్లి. మనల్ని రక్షించడానికి దేవుడు అన్ని చోట్లా ఉండలేడని, అందుకే అమ్మను సృష్టించాడని అంటారు. తల్లి అనేది ఒక పదం లేదా బంధం మాత్రమే కాదు..అది ఒక మానసిక అనుభూతి. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. అవసరం అయితే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. ఇది మనుషుల విషయంలో మాత్రమే కాదు పశు, పక్ష్యాదుల విషయంలో కూడా జరుగుతుంది. అందుకు ఉదాహరణగా తమ పిల్లల కోసం సింహంతో పోరాడిన సంఘటలు ఎన్నో ఉన్నాయి..
తల్లి ప్రేమని తెలియజేసే సంఘటలు మనుషులకే కాదు జంతువులకు, పక్షుల్లో కూడా చోటు చేసుకుంటాయి. తన బిడ్డ ఏ విధంగానూ బాధపడకూడదని తల్లి సంతోషంగా తన జీవితాన్ని త్యాగం చేసిన ఘటనలు గురించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. తల్లి తన పిల్లలు సురక్షితంగా ఉండాలని.. ఎటువంటి హాని జరగకూడదని కోరుకుంటుంది. అంతేకాదు పిల్లలకు ఏర్పడే ప్రతి సమస్య నుండి కాపాడుతుంది. ఇప్పుడు ఓ పక్షి తన బిడ్డను కాపాడుకోవడానికి పాముతో పోరాడుతున్న ఈ వీడియోను చూడండి. దీని తర్వాత ఏం జరిగిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కన్నీరు పెడతారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో కెనడాకు చెందినది అని చెబుతున్నారు. చెట్టుపై నిర్మించిన పక్షి గూడులోకి విషపూరిత పాము ప్రవేశించి అందులో ఉన్న పక్షి పిల్లలను తినడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన పక్షి తల్లి ఇదంతా చూసి తన పిల్లలను కాపాడుకోవడానికి పాముతో పోరాడింది. తన పిల్లలను పాము నుంచి కాపాడటానికి చివరి వరకు తన వంతు ప్రయత్నం చేసింది. అయితే చివరకు పక్షి తన ప్రాణాలను త్యాగం చేసి తన పిల్లలను పాము నుంచి కాపాడుకుంది. తన పక్షి పిల్లలకు ఏమీ జరగనివ్వదు.
@natureismetal అనే ఖాతా ద్వారా ఈ వీడియో Instagramలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూసి తల్లి దైర్యాన్ని కొనియాడుతున్నారు. తల్లి తన పిల్లల కోసం తనను తాను త్యాగం చేసిందని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు తల్లి ఎప్పుడూ తన పిల్లలను కాపాడుతుందని చెప్పారు. ఒకరు కవితా శైలిలో తల్లి ఉంటె చంద్రుడు వెన్నెల, ఆమె కదిలితే గాలి వీస్తుంది.. ఎండలో నీడలా.. , వానలో గొడుగు గా నిలిచేది తల్లి అంటూ తల్లి గొప్పదనాన్ని వెల్లడించారు. తన ప్రాణాలను సైతం విడిచే సాహసం ఒక్క తల్లి మాత్రమే చేయగలదని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..