Viral Video: వరుడు ఇచ్చిన ‘ఫిల్మీ స్టైల్’ ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..

పెళ్లి సందర్భంగా తీసుకునే ఫోటోలు, వీడియోలు కలకాలం గుర్తుండిపోయేలా తీస్తుంటారు. అతిధుల కోలాహలం, స్నేహితుల సందడి.. ఇలా ఒకటేమిటీ..

Viral Video: వరుడు ఇచ్చిన ఫిల్మీ స్టైల్ ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
Dance Moments Groom

Updated on: Jun 24, 2021 | 2:25 PM

పెళ్లి సందర్భంగా తీసుకునే ఫోటోలు, వీడియోలు కలకాలం గుర్తుండిపోయేలా తీస్తుంటారు. అతిధుల కోలాహలం, స్నేహితుల సందడి.. ఇలా ఒకటేమిటీ పెళ్లి అంటేనే హడావుడి. అందుకేనేమో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో వరుడు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది. అతడి సినీ స్టైల్ ఎంట్రీకి నవ్వకుండా ఉండలేరు.

పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్న వెంటనే వరుడు తన స్నేహితులు, తోటి సహచరులతో ఫిల్మీ స్టైల్‌లో ‘సాజన్ జీ ఘర్ ఆయే …’ పాటకు స్టెప్పులు వేశాడు. వరుడు ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీకి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఖచ్చితంగా వధువు కూడా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వరుడు ఇచ్చిన ఎంట్రీ అలా ఉంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.!

ఈ వీడియోను ‘ది వెడ్డింగ్ మేనియా’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 47,340 వ్యూస్ సంపాదించింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

Loading...
Unable to load recommendations.
Follow Us