Viral Video: స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే.. తల్లి కోతిని ముద్దాడిన పిల్ల కోతి.. ఎందుకో తెలుసా..?

|

Nov 21, 2021 | 7:44 PM

Baby Monkey: తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది.. ఆ బిడ్డ ఏం చేసినా కూడా ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమేనని చాలామంది పేర్కొంటుంటారు. మనుషులైనా.. జంతువులైనా తల్లి ప్రేమకు

Viral Video: స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే.. తల్లి కోతిని ముద్దాడిన పిల్ల కోతి.. ఎందుకో తెలుసా..?
Monkey
Follow us on

Baby Monkey: తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది.. ఆ బిడ్డ ఏం చేసినా కూడా ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమేనని చాలామంది పేర్కొంటుంటారు. మనుషులైనా.. జంతువులైనా తల్లి ప్రేమకు ఎవరూ అతీతం కాదు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తల్లి కోతికి పిల్ల ముద్దులు పెడుతుంటుంది. పిల్ల కోతి చేసిన పనికి అందరినుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే.. ఈ వీడియోను నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్న కోతి, దాని తల్లిని చూడవచ్చు. రెండు కూడా చెట్టుపై కూర్చున్నారు. ఈ క్రమంలో పిల్లకోతి బలహీనమైన చెట్టు కొమ్మ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటుంది. అది గ్రహించిన తల్లి తల్లి దాని కాలు పట్టుకుని కిందకు లాగుతుంది. దానిపైకి ఎక్కితే కిందపడి గాయపడొచ్చంటూ హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత తల్లి ఎందుకు చెబుతుందో గ్రహించిన పిల్ల కోతి.. తల్లి కోతి తలపై ముద్దాడుతూ కనిపిస్తుంది. చాలా ప్రేమతో దానిని ముద్దు పెట్టుకుంటుంది. దీనిని చూసి స్వచ్ఛమైన ప్రేమంటే ఇదేనంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తల్లి ప్రేమకు ఎవరైనా బానిసలే అంటూ పేర్కొంటున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను బాగా షేర్ చేస్తూ.. పలు కామెంట్లు చేస్తున్నారు. తల్లి ప్రేమంటే ఇదేనని.. పిల్లల కోసం ప్రతిదీ త్యాగం చేస్తుందంటూ పేర్కొంటున్నారు. ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉందని.. తల్లి అంటే ఇలాగే ఉంటుందంటూ పేర్కొంటున్నారు.

వీడియో. .

వైరల్ అవుతున్న ఈ వీడియోను waowafrica అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతోపాటు అందమైన క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను ఇప్పటివరు లక్షలాది మంది వీక్షించారు. చాలామంది లైక్‌ చేసి పలు కామెంట్లు రాస్తున్నారు.

Also Read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..