Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..

పెళ్లయిన తర్వాత అత్తవారి ఇంటికి వచ్చిన కొత్త వధువు చాలా సిగ్గుపడుతుంటారు. మొహమాట పడుతుంటారు. ఈ వీడియోల మాత్రం అలా జరగలేదు. మరదలితో కలిసి స్టెప్పులేస్తూ..

Viral Video: అమ్మో మాములుగా లేదే.. ఆటా.. పాటతో అత్తవారింట్లో దుమ్మురేపిన కొత్త కోడలు..
Bride Dance On Haryani Song

Updated on: Aug 01, 2021 | 1:45 PM

సరదా వీడియోలకు సోషల్ మీడియా కేంద్రంగా మారుతోంది. ఒకటి.. రెండు కాదు రోజుకు కొన్ని వందల వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. కొన్ని వీడియో చాలా అందంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. అదే సమయంలో  ప్రజల హృదయాలను నేరుగా గెలుచుకున్న వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ప్రజలలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

పెళ్లయిన తర్వాత అత్తవారి ఇంటికి వచ్చిన కొత్త వధువు చాలా సిగ్గుపడుతుంటారు. మొహమాట పడుతుంటారు. ఈ వీడియోల మాత్రం అలా జరగలేదు. మరదలితో కలిసి స్టెప్పులేస్తూ దుమ్ము రేపింది కొత్త కోడలు. అత్తవారి ఇంట్లో తొలి రోజును అని కూడా సంకోచించకండా అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో మీరు ఒక వధువు తన మరదలితో కలిసి కూల్‌గా డ్యాన్స్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఇది హర్యన్వి సాంగ్ (hariyanvi Song)  ’52 గజ్ కా దమన్ … ‘పై వధువు డ్యాన్స్ చేయడం ప్రారంభించిన వెంటనే.. ప్రజలు చూస్తూనే ఉన్నారు. వధువు ఈ పాటపై అద్భుతమైన డ్యాన్స్‌తో అందరి మనసులను దోచుకుంది.

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. తొలి రోజే ఎలాంటి మొహమాటం లేకుండా డ్యాన్ష చేయడం సూపర్ అంటూ ఒక యూజర్ ఇలా కామెంట్ చేశాడు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో anshuydv8 అనే వినియోగదారు షేర్ చేసారు.

ఇవి కూడా చదవండి: How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..