
సాధారణంగా కోతులు ఇళ్లపైకి ఎక్కడం, పండ్లు, తినుబండారాలు లేదా చేతిలో ఉన్న వస్తువులను లాక్కెళ్లడం చూస్తుంటాం. కానీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ కోతి చేసిన వింత పని చూసి అక్కడి స్థానికులు, మద్యం ప్రియులు అవాక్కయ్యారు. నేరుగా ఓ వైన్‌షాపులోకి దూరిన ఆ వానరం.. దర్జాగా మందు బాటిల్ ఖాళీ చేసి, కిక్కు ఎక్కడంతో అక్కడే హాయిగా నిద్రపోయింది. రాంచీ పరిధిలోని ఒర్మాంజీ బ్లాక్ చౌక్ సమీపంలో ఉన్న మద్యం షాపులోకి శుక్రవారం ఓ కోతి అకస్మాత్తుగా ప్రవేశించింది. లోపలికి వచ్చిన కోతిని చూసి షాపు సిబ్బంది కంగారుపడ్డారు. దానిని బయటకు పంపేందుకు షాపు యజమాని ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా అతనిపైకి దూకి కొరికింది. దీంతో భయపడిపోయిన సిబ్బంది దుకాణం నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక షాపులో ఎవరూ లేకపోవడంతో ఆ కోతి అక్కడ కౌంటర్‌పై ఉన్న ఓ లిక్కర్ బాటిల్‌ను ఎత్తుకుని చకచకా తాగేసింది. ఆల్కహాల్ శరీరంలోకి దిగడంతో కాసేపటికే మత్తులోకి జారుకుంది. ఆపై ఏకంగా మద్యం దుకాణంలోనే పడుకుని గురకపెట్టి నిద్రపోయింది.
ఈ వింత విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకడంతో స్థానికులు భారీ ఎత్తున వైన్‌షాపు వద్దకు చేరుకున్నారు. మందు కొట్టి మత్తులో నిద్రపోతున్న కోతిని చూసేందుకు జనం ఎగబడ్డారు. కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కోతి గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ, రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. కోతికి ఎలాంటి హాని కలగకుండా నెమ్మదిగా దానిని పట్టుకుని, సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Monkesh Bhai is in full party mood.
😁 Party is done, Don’t disturb plz !This monkey was so thirsty that it walked into a liquor store, broke a bottle, drank half a bottle of alcohol, and then comfortably fell asleep right inside the shop. pic.twitter.com/DWDKiTKf9L
— Amit Singh (@RockstarAmit) September 26, 2026
గతంలో ఓ సెలూన్‌లోకి దూరి బార్బర్ వద్ద మసాజ్ చేయించుకున్న కోతి వీడియో ఎంతలా వైరల్ అయిందో.. ఇప్పుడు వైన్‌షాపులో మందు కొట్టి కిక్కెక్కి పడుకున్న ఈ కోతి వ్యవహారం కూడా నెట్టింట అంతే వైరల్‌గా మారింది. మనుషుల అలవాట్లు కోతులకూ పాకినట్టున్నాయి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Monkesh Bhai Aaj Sunday mana rahe hain. 😎 Asli weekend ka anand to yahi le rahe hain.
Tired monkey visits a barber shop for a relaxing body massage 😀 without money. The Barber is doing it happily 😊. pic.twitter.com/gWKOrMh9Nf
— Amit Singh (@RockstarAmit) September 20, 2026