లైఫ్ లో పనులు చేయడం పట్ల స్పీడ్ ఉండాలి కానీ, బైక్ నడిపేప్పుడు స్పీడ్ ఉంటే అనర్థాలే వెంట వస్తాయి. అయితే ప్రజంట్ యూత్ మాట వినడం లేదు. బైక్ వేగంగా నడిపితే ఏదో అవార్డ్స్ ఇస్తున్నట్లు రయ్యిమంటూ దూసుకెళ్లిపోతున్నారు. అయినా నిబంధనలు పాటిస్తున్నారా అంటే అదీ లేదు. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. యూ టర్న్ తీసుకుంటున్న బస్సుని పట్టించుకోకుండా స్కూటీపై మెరుపు వేగంతో దూసుకెళ్లాడు. చివరి క్షణంలో ఆ వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో అదృష్టవశాత్తు బైకర్ కు ఏం కాలేదు. రోడ్డుపై తగినంత స్పేస్ లేకపోవడంతో బైక్ నడుపుతోన్న వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్‌ని రాసుకుంటూ ..ఒక షాపు, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే ఒళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. ‘అతడు చాలా లక్కీ’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా,’ భూమ్మీద గడ్డిగింజలు ఉండి బ్రతికిపోయాడు’ అని మరోకరు రాసుకొచ్చారు.
వీడియో చూడండి
Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. ???
The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. ? pic.twitter.com/c4vAvbbikj
— Mangalore City (@MangaloreCity) January 11, 2022
Also Read: నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్