Viral Video: విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి.. మంటల్లో సురక్షితంగా భగవద్గీత.. వీడియో వైరల్

అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయింది. ఈ విషాదానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు విమాన ప్రమాద స్థలానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో అంతా బూడిదగా మారినప్పటికీ.. శిథిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి.. మంటల్లో సురక్షితంగా భగవద్గీత.. వీడియో వైరల్
Bhagavad Gita Safe In Plane Crash
Image Credit source: Instagram

Updated on: Jun 13, 2025 | 12:14 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం పరిగణించబడుతుంది . ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా మొత్తం 246 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని సామాన్లతో సహా అంతా అగ్నికి దహనమై బూడిదైపోయింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో.. శిథిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది. విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ… అగ్నికి దహనం కాకుండా ఒక్క భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడ ఉంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

శిథిలాల కింద బయటపడిన భగవద్గీత

ఇవి కూడా చదవండి

విమానం కూలిపోయిన తర్వాత భారీ మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు.. అందులోని వస్తువులు కూడా దగ్ధం అయ్యాయి. అయినప్పటికీ భగవద్గీత చెక్కుచెదరకుండా ఉన్నట్లు చూపించే ఒక వీడియో వైరల్ అవుతోంది. కాలిపోయిన అవశేషాల కింద భగవద్గీత సురక్షితంగా కనుగొనబడింది. అయితే దీనికి ప్రామాణికత ఇంకా తెలియదు.

విమాన ప్రమాదంలో ప్రతిదీ నాశనమైంది. అయితే భగవద్గీత లోపల నుంచి చెక్కుచెదరకుండా ఉంది” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో amdavad.clicks అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆపరేషన్ సమయంలో దొరికిన భగవద్గీత పుస్తకాన్ని ఒక వ్యక్తి తెరిచి ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. జూన్ 12న షేర్ చేయబడిన ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. షేర్ చేస్తూ పదిమందికి ఈ విషయాన్నీ తెలియజేస్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..